మనకు ఇష్టమైన ఆహారాల్లో చాలామంది ఇష్టంగా తినే.. మాంసాహారం క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇది మీ కణాల DNA ని మారుస్తుంది. ఇది మీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కూడా కొన్నిసందర్భాల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వేడిచేసిన వంట నూనెను వంట కోసం మళ్లీ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

మనం తినే కొన్ని ఆహారపదార్ధాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే అవి ఏమిటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం మంచింది. ఇంతకీ క్యాన్సర్ ముప్పు వేటి వల్ల వస్తుంది.

మనం జీవించడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం చాలా అవసరం. అయితే ఆ ఆహారం(Food) మనకు హానిచేసేది అయితే.. దాన్ని దూరంగా పెట్టడం ఎంతో అవసరం. అవును.. మనం తినే కొన్ని ఆహార పదార్థాలు మనకు హాని కలిగిస్తాయని మీకు తెలుసా? మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా, అది కొన్నిసార్లు శరీరానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. . కాబట్టి, ఏయే రకాల ఆహారాలు క్యాన్సర్‌కు దారితీస్తాయో.. తెలుసుకొని వాటికి దూరంగా ఉండండి..

మనకు ఇష్టమైన ఆహారాల్లో చాలామంది ఇష్టంగా తినే.. మాంసాహారం క్యాన్సర్‌కు(Cancer) కారణమవుతుంది. ఇది మీ కణాల DNA ని మారుస్తుంది. ఇది మీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, వేయించిన ఆహారాన్ని(Fried food) ఎక్కువగా తినడం వల్ల కూడా కొన్నిసందర్భాల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వేడిచేసిన వంట నూనెను వంట కోసం మళ్లీ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

అంతే కాదు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం కూడా కొన్నిసార్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సాల్టెడ్ ఫిష్(Fish) వంటి సాల్ట్ ఫుడ్స్ కూడా క్యాన్సర్‌కు కారణమవుతాయి. మరీ ముఖ్యంగా బీఫ్ మరియు మటన్ వంటి రెడ్ మీట్‌లను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వీటిని తీసుకోవడం కూడా పరిమితం చేయండి. మరియు చక్కెర(Sugar) అధికంగా ఉన్న ఆహారాలు, అధిక చక్కెర కలిగిన శీతల పానీయాలు, ఇతర రసాయనాలు మరియు చాలా తీపి ఆహారాలు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

అంతేనా.. ప్రతీ మనిషి అతిగా తాగడం వల్ల కొన్ని క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మద్యం కూడా తగ్గించండి. మధ్యం మానేసతే.. మొత్తం ఆరోగ్యానికి మంచిది. హైడ్రోజనేటెడ్ కొవ్వులకు బదులుగా నెయ్యి, కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె ఉపయోగించడం మంచిది. ఇక ఈ కాలంలో ఎక్కువగా యూత్ ఉపయోగిస్తున్న ఎనర్జీ డ్రింక్స్ తాగకపోవడమే మంచిది.

అలాగే సిగరెట్లు, బీడీలు వంటివి కాల్చకూడదు. పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి. ఎండలో ఎక్కువగా ఉండకండి. సూర్యకాంతి నుండి రక్షణ అవసరం. ఇండోర్ మరియు అవుట్డోర్ వాయు కాలుష్యాన్ని తగ్గించండి.ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి..శారీరక వ్యాయామం తప్పనిసరి. తల్లిపాలు శిశువులలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, పిల్లలకు హెపటైటిస్ బి మరియు హెచ్‌పివికి వ్యతిరేకంగా టీకాలు వేయాలి. ఇలా క్యాన్సర్ కారకాలను ముందునుంచే గుర్తించి దూరంగా ఉంచడం మంచింది.

Updated On 26 Jan 2024 8:27 AM GMT
Ehatv

Ehatv

Next Story