ఈకాలంలో ఆర్టిఫిషల్ జీవనశైలి..రసాయనాలతో కూడిన ఆహారం తినడం లాంటి వాటి వల్ల చిన్న వయస్సులోనే అనేక రోగాలకు గురి అవుతున్నాము. గుండెపోటు, స్ట్రోక్ మరియు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుంది. ఈమధ్య జరిగిన కొత్త అధ్యయనాలు ఏం చెపుతున్నాయంటే రోజూ చక్కెర కలిసిన కూల్ డ్రింక్స్ తాగే స్త్రీలలో కాలేయ క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది.

అమెరికాలోని(America lo) బ్రిగ్‌హమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్(Brigham and Women's Hospital) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనంలో ఉమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ నుండి దాదాపు 100,000 పోస్ట్ మెనోపాజ్ మహిళలు ఉన్నారు. వారిని 20 ఏళ్లుగా పర్యవేక్షించారు. ఈ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వారు కనిపెట్టడం జరిగింది.
అందులో ఎక్కువగా మహిళలు రోజు కూల్ డ్రింక్స్(Cool Drinks) తాగడం వల్ల.. కాలేయ(Liver) సంబంధిత వ్యాధులకు గురి అయ్యి.. మరణించిన వారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. చక్కెర మరియు సోడా(Soda) అధికంగా ఉండే శీతల పానీయాలు ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆరోగ్యానికి పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తాయని అధ్యయనం నిర్ధారించింది. ఊబకాయం మధుమేహం, క్యాన్సర్, కాలేయం దెబ్బతినడం, జీర్ణ సమస్యలు మరియు ఎముకల ఆరోగ్య సమస్యలు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో కాలేయ క్యాన్సర్(Liver Cancer), హైరిస్క్ ప్రెగ్నెన్సీ(High risk Pregnnacy), గుండె జబ్బులు, కీళ్లనొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.
అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, రోజుకు 20 ఔన్సుల సోడా తీసుకోవడం 4 1/2 సంవత్సరాల కంటే ఎక్కువ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. శీతల పానీయాలలో అధిక కేలరీలు దీనికి కారణమని చెప్పవచ్చు.అధిక సోడా సీరం పొటాషియం తగ్గడానికి దారితీస్తుంది, ఇది అరిథ్మియా వంటి గుండె సమస్యలకు దారితీస్తుంది.
రోజూ సోడా తినే స్త్రీలకు గౌట్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. శీతల పానీయాలలో ప్రధాన పదార్ధాలలో ఒకటి ఫాస్పోరిక్ యాసిడ్, ఇది ఎముకల నుండి కాల్షియంను లీచ్ చేస్తుంది. ఊబకాయం, టైప్ 2 మధుమేహం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి వైద్యులు చక్కెర పానీయాలను నివారించడం లేదా తగ్గించడం సిఫార్సు చేస్తారు. చక్కెర శీతల పానీయాలకు బదులుగా ఆరోగ్యకరమైన పండ్ల రసాలను తాగాలని కూడా వారికి సలహా ఇస్తారు.