ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు(Children) చదువుల్లో, ఆటపాటల్లో అన్నింట్లోనూ ముందంజలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. తమ పిల్లల బుర్ర చాలా చురుకుగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఏవేవో కసరత్తులు వారు చేయడమే కాదు.. పిల్లలతోనూ చేయిస్తారు.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు(Children) చదువుల్లో, ఆటపాటల్లో అన్నింట్లోనూ ముందంజలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. తమ పిల్లల బుర్ర చాలా చురుకుగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఏవేవో కసరత్తులు వారు చేయడమే కాదు.. పిల్లలతోనూ చేయిస్తారు. అయితే.. ఎక్కువ తిప్పలు పడకుండా.. కొన్ని రకాల ఫుడ్స్ ని పిల్లలకు తనిపించడం వల్ల.. వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేస్తుందని మీకు తెలుసా? మరి ఆ ఫుడ్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం..

ముందుగా పిల్లలు ఇష్టపడే పదార్ధాల గురించ తెలుసుకుందాం.. చాక్లెట్స్(choclates) ఇష్టపడని పిల్లలు ఎవరూ ఉండరు. అయితే.. వారు తినే నార్మల్ చాక్లెట్ కి బదులు..డార్క్ చాక్లెట్(Dark choclates) ఇవ్వడం అలవాటు చేయండి. చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తినడం వల్ల.. పిల్లల బ్రెయిన్ చాలా చురుకుగా పని చేస్తుంది. కాకపోతే టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి తినడం అలవాటు అయితే.. పిల్లలువదిలిపెట్టరు మరి.

పిల్లలకు పక్కాగా పెట్టాలి అని పేరెట్స్ అనుకునే వాటిలో.. నట్స్(NUTS) కంపల్సరిగా ఉంటాయి. నార్మల్ గా పేరెంట్స్ అందరూ తమ పిల్లలకు నట్స్ తినిపించాలని అనుకుంటారు. ఆ నట్స్ తినడం వల్ల.. కూడా బ్రెయిన్ చాలా చురుకుగా పని చేస్తుంది. పిల్లలు నట్స్ తినకపోతే.. పౌడర్ లా చేసి అయినా.. వేరే ఫుడ్స్ లో కలిపి తినిపించవచ్చు.

గుడ్డులో(Egg) విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉంటాయి.ప్రతిరోజూ పిల్లలకు ఒక కోడిగుడ్డు అందించాలి. అలా గుడ్డు తినడం వల్ల కూడా.. పిల్లల బ్రెయిన్ చురుకుగా పని చేస్తుంది.

బ్రోకలీ(Broccali) ఈ మధ్యకాలంలో ఎక్కువగా లభిస్తున్న కూరగాయ. దీనిని చాల రకాలుగా తీసుకోవచ్చు. సలాడ్ రూపంలో అయినా పిల్లలకు అందించవచ్చు. దీనిలోనూ యాంటీ ఆక్సీడెంట్స్ తోపాటు.. విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. మెదడు చురుకుగా పని చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పెరుగులకు, చురుకుగా పని చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్ లను పిల్లల ఆహారంలో భాగం చేయాలి. ఇలా చేయడం వల్ల.. అవి మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది.

Updated On 28 Jan 2024 3:16 AM GMT
Ehatv

Ehatv

Next Story