కుంకుమపువ్వు(Kesari) మాట వినగానే.. ప్రెగ్నెంట్ లేడీస్(Pregnant Ladies) గుర్తుకు వస్తారు.. ఎందుకంటే.. కుంకుమ పువ్వు పాలల్లో కలిపి ఇస్తే.. బిడ్డ ఎర్రగాపుడతాడి అంటుంటారు. కుంకుమ పువ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది రక్తాన్ని శుద్ది(Blood Purification) చేయడంతో పాటు.. అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంతకీ కుంకుమ పువ్వు ఉపయోగాలుఏంటో తెలుసా..?

కుంకుమ పువ్వు రక్తహీనతను నయం చేస్తుంది.. అంతే కాదు కడుపులో బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది తింటే.. పుట్టిన బిడ్డ మంచి ఛాయతో పుడతాడని జనాల విశ్వాసం.
తమలపాకులతో కుంకుమపువ్వు తింటే లేదా మరిగించి ఆ నీరు తాగితే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. కుంకుమపువ్వు ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుందని అంటుంటారు.
ప్రసవానంతర తల్లుల వల్ల కలిగే రక్త నష్టాన్ని సరిచేయడానికి, మూర్ఛ నుండి ఉపశమనం పొందేందుకు మరియు ఉల్లాసాన్ని ఇవ్వడానికి మరియు రక్తహీనతను నివారించడానికి ప్రతిరోజూ 1 గ్లాసు పాలలో 1/2 గ్రాములు కుంకుమ పువ్వు తాగాలని పెద్దల సూచన
ఆకలిని బాగా ప్రేరేపిస్తుంది
రాత్రి పడుకునే ముందు పాలలో కుంకుమపువ్వు కలుపుకుని తాగితే జీర్ణశక్తి మెరుగై ఆకలి బాగా పెరుగుతుంది. కుంకుమపువ్వును పాలలో కలిపి తాగడం వల్ల ఖనిజాభివృద్ధి మెరుగుపడుతుంది, కడుపులో అల్సర్లు(Ulcer) నయమవుతాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి మరియు రక్తహీనత నయం అవుతుంది.
గర్భిణీ స్త్రీలకు జలుబు, దగ్గు ఉంటే శిశువు ఆరోగ్యం దెబ్బతింటుంది. జలుబు మరియు దగ్గుకు కుంకుమపువ్వు ఉత్తమ ఔషధం. ఇలా రకరకాలు కారణాల వల్ల కుంకుమ పువ్వు ఆరోగ్యానికి మంచిది అని చెప్పబడింది. కాని ఇది ధర ఎక్కువ కావడంతో.. పేద, మధ్యతరగతి వారికి పెద్దగా అందుబాటులో లేదు.