రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి(Cold weather) తీవ్రరూపం దాల్చుతోంది. చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుండటంతో రెండు రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ(Weather Department) వెల్లడించింది. కొన్ని జిల్లాలకు వాతావారణశాఖ యెల్లో అలర్ట్(Yellow alert) జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు(Temperatures) కనిష్ట స్థాయిలో నమోదవుతుండటంతో వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గడ్డకట్టుకుపోయే స్థాయిలో చలి ఉంటోంది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కొందరు తట్టుకోలేక చలిమంటలేసుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు చలిబారిన పడాల్సి వస్తోంది. సాయంత్రం వేళల్లో పొగమంచు(Fog) కమ్ముకుంటోంది. దీంతో హైవేలపై(High way) వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. దీని కారణంగానే ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పగటి కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోవడం ఆందోళన కలిగి స్తోంది. నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి.
వాతావరణం ఇలాగే ఉంటే రాబోయే నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకా శం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు(Precautions) తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.