ఇద్దరు వ్యక్తులు తమ చెప్పులు లేని కాళ్లతో పానిపూరి కోసం పిండిని పిసుకుతున్నట్లు చూపించే సోషల్ మీడియా ఫుటేజ్ వైరల్‌గా మారింది వివాదానికి దారితీసింది.

ఇద్దరు వ్యక్తులు తమ చెప్పులు లేని కాళ్లతో పానిపూరి కోసం పిండిని పిసుకుతున్నట్లు చూపించే సోషల్ మీడియా ఫుటేజ్ వైరల్‌గా మారింది వివాదానికి దారితీసింది. పోలీసుల విచారణలో, రుచిని పెంచడానికి పిండిలో టాయిలెట్ క్లీనర్ హార్పిక్, యూరియా కలిపినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు దుకాణదారులను అదుపులోకి తీసుకుని దుకాణానికి సీల్‌ వేశారు. సోదాలు జరుగుతున్నాయి. జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఫుటేజీలో, ఇద్దరు వ్యక్తులు తమ కాళ్లతో తొక్కి పానిపూరి పిండిని పిసికినట్లు వీడియోలో ఉంది. ఈ వీడియోను X లో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. వారు చేసిన పట్ల అసహ్యించుకున్నారు. సంఘటన జరిగిన నగర్ పంచాయితీ మార్కెట్‌లోని నివాసితులు, ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం బయటపడింది. నిందితులను విచారించగా పానిపూరి రుచిగా ఉండేందుకు టాయిలెట్ క్లీనర్ హార్పిక్‌ను, యూరియాను వాడినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story