టమోటాలు లేకుండా ఏ కూరకు గ్రేవీ పూర్తి కాదు. ఇది వంటకానికి ప్రాథమిక రుచి ఇస్తుంది. చికెన్ కు గ్రేవీ కావాలంటే టామాట ఉండాల్సిందే. కాబట్టి టమోటాలు లేకుండా భారతీయ వంటకాలు అసంపూర్ణంగా ఉంటాయి. మన ఆహార సంస్కృతిలో టొమాటో ప్రధాన భాగం కావడానికి కారణం ఏంటో తెలుసా..? ఇది లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంది. మరి ఆ లాభాలు ఏమిటో తెలుసా?
టామాటోనే(Tomato) కదా అని తేలిగ్గా తీసుకోకండి.. అన్ని కూరలకు కాంబినేషన్ గా వాడే టామోటాలో ఎన్నో ఉపయోగపడే గుణాలు ఉన్నాయని తెలుసుకోండి. అవి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం..
టమోటాలు లేకుండా ఏ కూరకు గ్రేవీ పూర్తి కాదు. ఇది వంటకానికి ప్రాథమిక రుచి ఇస్తుంది. చికెన్ కు గ్రేవీ కావాలంటే టామాట ఉండాల్సిందే. కాబట్టి టమోటాలు లేకుండా భారతీయ వంటకాలు అసంపూర్ణంగా ఉంటాయి. మన ఆహార సంస్కృతిలో టొమాటో ప్రధాన భాగం కావడానికి కారణం ఏంటో తెలుసా..? ఇది లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంది. మరి ఆ లాభాలు ఏమిటో తెలుసా?
టొమాటోలో విటమిన్ సి(Vitamin c), పొటాషియం, విటమిన్ కె, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. టొమాటోలు అధిక రక్తపోటును(Blood pressure) నియంత్రిస్తాయి. అసలు టొమాటోలు రక్తపోటును ఎలా నియంత్రిస్తాయి? అని అందరికి డౌట్ రావచ్చు. సాధారణంగా మనం రోజూ తీసుకునే ఆహారంలో సోడియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం లెవల్స్ బ్యాలెన్స్ అవుతుంది. టొమాటోల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల కాబట్టి మనం రోజువారీ ఆహారంలో టమోటాలను చేర్చుకుంటే అది మన శరీరంలో సోడియం మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
మీ రోజువారీ ఆహారంలో టమోటాలు చేర్చుకోవడం క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అంటే టొమాటోలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఊపిరితిత్తులు మరియు కడుపు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.
టొమాటోలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని సూక్ష్మక్రిములతో పోరాడడమే కాకుండా మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది శరీరం మరియు గుండె కండరాలకు కూడా మేలు చేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని(Healthy Heart) టమాటా మెరుగుపరుస్తుంది అది ఎలాగంటే..? టొమాటోలో ఫైబర్, విటమిన్ సి మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడమే కాకుండా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక టొమాటోను చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మంలో అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.