అరటిపండు(Banana) ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీనిని రోజూ తినడం అనేక ప్రయోడనాలను అందిస్తుంది. అలాగే ప్రతి సీజన్‌లో అరటిపండ్లను చాలా మంది ఎక్కువగా తీసుకుంటారు. కానీ అరటిపండ్లు కొన్న ఒక రోజు తర్వాత తర్వాత మరుసటి రోజు అవి నల్లగా మారడం జరుగుతుంది. దీంతో అరటిపండ్లను తినడం మానేస్తారు. అటువంటి పరిస్థితిలో కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా అరటిని చాలా రోజులు తాజాగా ఉంచవచ్చు. అదేలాగో తెలుసుకుందామా.

అరటిపండ్లను వేలాడదీయాలి.. అరటిపండ్లను అలాగే వదిలేయడం వలన అవి త్వరగా నల్లగా మారుతాయి. దీంతో వాటిని తాజాగా ఉంచడానికి వాటిని వేలాడదీయడం ఉత్తమ ఎంపిక. చాలా మంది దుకాణదారులు అరటిపండ్లను తాడుతో వేలాడదీయడం మార్కెట్‌లో చూసి ఉంటారు. అందుకోసం ఒక బనానా స్టాండ్ కూడా కొనుగోలు చేయవచ్చు.
ప్లాస్టిక్‌లో పెట్టాలి.. అరటిపండ్లను చాలా రోజులు తాజాగా ఉంచడానికి, వాటిని ప్లాస్టిక్‌లో చుట్టి కూడా పెట్టాలి. అయితే అరటిపండు కొమ్మ భాగంలో మాత్రమే ప్లాస్టిక్‌ను చుట్టాలి. ఇలా చేస్తే అరటిపండ్ల నుంచి విడుదలయ్యే ఇథిలిన్ గ్యాస్ తక్కువగా విడుదలై అరటిపండ్లు తాజాగా ఉంటాయి.
వెనిగర్.. అరటిపండ్లు పాడవకుండా ఉండటానికి వాటిని వెనిగర్‌తో శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం వైట్ వెనిగర్ మాత్రమే ఉపయోగించాలి. నీటిలో కొద్దిగా వెనిగర్ కలపి ఈ నీటితో అరటిపండ్లను శుభ్రం చేయండి. దీని వల్ల అరటిపండ్లు ఎక్కువ రోజులు నల్లగా మారవు, చెడిపోకుండా ఉంటాయి.
ఫ్రీజర్‌లో నిల్వ చేయాలి.. అరటిపండ్లను ఒక నెల పాటు తాజాగా ఉంచవచ్చు. ఇందుకోసం అరటిపండ్లను గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. దీని తరువాత, వాటిని తినాలనుకున్నప్పుడు, వాటిని తీసివేసి, గది ఉష్ణోగ్రత వద్ద కొంత సమయం పాటు పెట్టాలి. ఆ తర్వాత వాటిని తినండి.
అరటిపండు త్వరగా నల్లబడకుండా ఉండాలంటే, వాటిని కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడా కట్ చేయకుండా లేదా నలిగిపోకుండా చూసుకోవాలి. అలాగే, అతిగా పండిన అరటిపండ్లను కొనకుండా ఉండాలి. అరటిపండ్లను చాలా రోజులు నిల్వ చేసి ఉపయోగించాలనుకుంటే, కొంచెం గట్టిగా ఉండే అరటిని కొనుగోలు చేయడం మంచిది.