రోజూ పాలు(Milk) తాగితే ఆరోగ్యానికి మంచిది. అలాగే క్రమం తప్పకుండా పాలు తీసుకోవడం వలన జుట్టు(Hair), చర్మ సమస్యలు(Skin Problems) కూడా తగ్గుతాయి. అలాగే ఇవి శరీరానికి పోషకాలు అందిస్తాయి. కాల్షియం(Calcium), ప్రోటీన్(Protiens), విటమిన్లు(Vitamins) A, K, D, I, ఫాస్పరస్(Phosphorus), మెగ్నీషియం(Magnesium), అయోడిన్(Iodine) వంటి పోషకాలు శరీరానికి అందిస్తాయి.

రోజూ పాలు(Milk) తాగితే ఆరోగ్యానికి మంచిది. అలాగే క్రమం తప్పకుండా పాలు తీసుకోవడం వలన జుట్టు(Hair), చర్మ సమస్యలు(Skin Problems) కూడా తగ్గుతాయి. అలాగే ఇవి శరీరానికి పోషకాలు అందిస్తాయి. కాల్షియం(Calcium), ప్రోటీన్(Protiens), విటమిన్లు(Vitamins) A, K, D, I, ఫాస్పరస్(Phosphorus), మెగ్నీషియం(Magnesium), అయోడిన్(Iodine) వంటి పోషకాలు శరీరానికి అందిస్తాయి. పాలను రెగ్యులర్ తీసుకోవడం వలన బరువు తగ్గడమే కాకుండా కండరాలను(Muscles) బలంగా ఉంచుతుంది. అయితే పాలు తాగడానికి సరైన సమయం ఏంటో తెలుసా?... సరైన సమయం కాకుండా వేరే సమయంలో పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పాలు ఎప్పుడు తాగాలని చాలా మందికి అర్థం కానీ విషయం. కొందరు ఉదయాన్నే తీసుకోవాలి అంటే.. మరికొందరు మాత్రం రాత్రి నిద్రకు ముందు తాగాలి అంటారు. ఇంతకీ ఏది సరైన సమయం అనేది ఇప్పటికీ స్పష్టతలేని విషయం. మరీ పాలు ఏ సమయంలో తీసుకోవాలనేది నిపుణుల అభిప్రాయాలను తెలుసుకుందాం.

తిన్న తర్వాత ఎంతసేపటికి పాలు తాగడం మంచిది?
ఆయుర్వేదంలో పాలను ఆరోగ్యానికి నిధిగా పరిగణిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం తిన్న వెంటనే పాలు తాగకూడదు. అంతే కాకుండా పాలు తాగిన తర్వాత పుల్లటి పదార్థాలు లేదా పండ్లు, పెరుగు వంటి వాటిని తీసుకోవద్దు. ఇలాగే వీటన్నింటిని తీసుకున్న తర్వాత కూడా పాలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆహారం తిన్న తర్వాత ఎంత సేపటి తర్వాత పాలు తాగాలి అనేది అందరిలోనూ ఉన్న సందేహం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం తిన్న 40 నిమిషాల తర్వాత పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖాళీ కడుపుతో పాలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ సమస్యలు ఉన్న వ్యక్తులు ఏదైనా తిన్న తర్వాత మాత్రమే పాలు తాగాలి. అయితే చిన్న పిల్లలు ఉదయాన్నే పాలు తాగొచ్చు. వారు ఎప్పుడైనా పాలు తాగవచ్చు. దీనివల్ల వారికి శక్తి లభిస్తుంది. కానీ పెద్దలు మాత్రం ఉదయాన్నే పాలు తాగడం మానుకోవాలి.

Updated On 12 Jun 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story