ప్రస్తుతం చాలా మంది చర్మ సంరక్షణ(Skin Protection) కోసం అనేక రకాల కెమికల్ ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. సన్ స్క్రిన్(sun screen), బాడీ లోషన్(Body lotion), ఇక వివిధ రకాల క్రీమ్స్ అన్నింటిని ఉపయోగిస్తారు. ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఇక మార్కెట్లో లభించే ఖరీదైన బ్రాండ్స్ కోసం పరుగులు పెడుతుంటారు అమ్మాయిలు. కానీ సహజంగా మీ చుట్టూ లభించే కొన్ని ఆహార పదార్థాలు, పండ్లు(Fruits) రోజూ తీసుకోవడం వలన మీ చర్మం అందంగా మారుతుంది.
ప్రస్తుతం చాలా మంది చర్మ సంరక్షణ(Skin Protection) కోసం అనేక రకాల కెమికల్ ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. సన్ స్క్రిన్(sun screen), బాడీ లోషన్(Body lotion), ఇక వివిధ రకాల క్రీమ్స్ అన్నింటిని ఉపయోగిస్తారు. ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఇక మార్కెట్లో లభించే ఖరీదైన బ్రాండ్స్ కోసం పరుగులు పెడుతుంటారు అమ్మాయిలు. కానీ సహజంగా మీ చుట్టూ లభించే కొన్ని ఆహార పదార్థాలు, పండ్లు(Fruits) రోజూ తీసుకోవడం వలన మీ చర్మం అందంగా మారుతుంది. పొడిబారడం.. దురద.. నలుపు, టాన్ కావడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ముఖం అందంగా కనిపించాలంటే బొప్పాయి ఫేస్ ప్యాక్ వేస్తుంటారు. అలా కాకుండా ఒక్క వారం కొన్ని పండ్లు తినడం వలన మీ ముఖం, చర్మం మరింత ప్రకాశవంతంగా తయారవుతుంది. తాజా పండ్లు మీ చర్మాన్ని అందంగా, మృదువుగా చేస్తాయి. ముఖ్యంగా పండ్లలోని పోషకాలు శరీరాన్నే కాకుండా చర్మాన్ని తాజాగా(fresh), ఆరోగ్యంగా(Helathy) ఉంచుతాయి. కొన్ని పండ్లలో సహజమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వారం తినాల్సిన సూపర్ ఫ్రూట్స్ ఇవే..
ఆపిల్(apple)..
ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా మేలు చేస్తుంది ఆపిల్. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్లు, మొటిమలను తగ్గిస్తుంది. ఆపిల్ పేస్ట్‌ను బేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా కొన్ని చెంచాల తాజా యాపిల్ జ్యూస్‌ని తీసుకుని, స్నానం చేసే నీటిలో కలిపి ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల మంచి రంగు వస్తుంది.
అనాస పండు (Pine apple)
పైనాపిల్ చర్మానికి అద్భుతమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది పొడి, కఠినమైన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అలాగే చర్మాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. పైనాపిల్ ను గ్రైండ్ చేసి ముఖానికి, శరీరానికి పట్టించి స్నానం చేస్తే చర్మం మెరుస్తుంది.
బొప్పాయి(Papaya)
బొప్పాయి చాలా కాలం నుంచి చర్మానికి ఉపయోగించే ఫ్రూట్. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ముఖానికి మంచి బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే డార్క్ స్పాట్స్, బ్లాక్ స్కిన్ టోన్‌ని సరిచేసి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. బొప్పాయి రసం లేదా పేస్ట్‌ను బేస్ ప్యాక్‌గా లేదా సబ్బుకు బదులుగా స్నానానికి ఉపయోగిస్తే చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
నిమ్మ(Lemon), నారింజ(orange)
నిమ్మ, నారింజ పండ్లలోని విటమిన్ సి, సిట్రస్ యాసిడ్ చర్మాన్ని బ్లీచ్ చేసి కాంతివంతంగా మారుస్తుంది. అలాగే వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై నలుపును తొలగించి ప్రకాశవంతంగా మారుస్తాయి. అంతేకాకుండా..
నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ వంటి సిట్రస్ పండ్ల రసాన్ని ప్రతిసారి ముఖానికి రాసుకుంటే నల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.
అరటి పండ్లు(Banana)..
అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మానికి మెరుపునిస్తాయి. ముఖ్యంగా స్కిన్ ఇన్ఫెక్షన్లను నయం చేసి చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నవారు రోజూ అరటిపండును చర్మానికి రాసుకుంటే పొడిబారకుండా ముఖం మృదువుగా మారుతుంది. చర్మ రంధ్రాల లోపల ఉన్న బ్లాక్ హెడ్స్, మురికి తొలగిపోయి చర్మం క్లియర్ స్కిన్ గా మారుతుంది.