ఎండలు మండిపోతున్నాయి.. పెద్దలే తట్టుకోలేకపోతున్నారు. మరి పిల్లల పరిస్థితి ఏంటీ..? ఆ.. మాకు ఏసీలు ఉన్నాయి.. కూలర్లు ఉన్నాయి అనుకోకండి.. ఏసీ చల్లదనం నుంచి ఒకేసారి బయటకు వస్తే.. ఆ వాతవరణం మార్పుల వల్ల కూడా శరీరం తట్టుకోలేక వడదెబ్బ(Heat Stroke) తగిలే అవకాశం ఉంది. వడదెబ్బ అంటే ఎండలోకే వెళ్లవలసిన అవసరం ఏదు. ఎండలో ఉన్నా ఉండకపోయినా.. వడగాలి, వేడి గాలి, ఉబ్బ.. విపరీతమైన దాహం, డీహైడ్రేషన్ కారణంగా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎండలు మండిపోతున్నాయి.. పెద్దలే తట్టుకోలేకపోతున్నారు. మరి పిల్లల పరిస్థితి ఏంటీ..? ఆ.. మాకు ఏసీలు ఉన్నాయి.. కూలర్లు ఉన్నాయి అనుకోకండి.. ఏసీ చల్లదనం నుంచి ఒకేసారి బయటకు వస్తే.. ఆ వాతవరణం మార్పుల వల్ల కూడా శరీరం తట్టుకోలేక వడదెబ్బ(Heat Stroke) తగిలే అవకాశం ఉంది.
వడదెబ్బ అంటే ఎండలోకే వెళ్లవలసిన అవసరం ఏదు. ఎండలో ఉన్నా ఉండకపోయినా.. వడగాలి, వేడి గాలి, ఉబ్బ.. విపరీతమైన దాహం, డీహైడ్రేషన్ కారణంగా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలన సరిగ్గా పట్టించుకోలేదనుకోండి.. వారి పరిస్థితి దారుణంగా తయారవుతుంది.
మరి పిల్లల్లో హీట్ స్ట్రోక్ తగలకుండా ఏం చేయాలి..? ఒక వేళ తగిలితే ఎలా ఉంటుంది...? ఏం చేయాలి అనేది చూస్తే... వడదెబ్బ వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో అలసట, బద్ధకం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతారు. అటువంటి పరిస్థితిలో పిల్లలు మండే వేడిలో చల్లని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
పిల్లలు హీట్ స్ట్రోక్ మొదలైన వాటిని నివారించడానికి సత్తు, మజ్జిగ, నిమ్మరసం మొదలైనవి తినవచ్చు. పిల్లల డైట్‌లో సెపరేట్ గా ఆహారం మార్చుకుంటే ఎండ దెబ్బ లేకపోతే.. వడ దెబ్బ నుంచి కాపాడుకోవచ్చు..
పిల్లలకు చలువచేసే పదార్ధాలు అలవాటు చేయండి. కొబ్బరి నీళ్లు.. పుచ్చకాయ లాంటివి శరీరాన్ని డీహైడ్రైట్ అవ్వకుండా కాపాడుతాయి. పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది.
రోజు పిల్లల ఆహారంతో పాటు పలుచటి మజ్జిగ.. కూడా జత చేయండి. ఏదైనా ఫ్రూట్ జూస్ రోజు ఇచ్చే విధంగా చూడండి. వాటితో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినిపించండి. అవి పిల్లల శరీరం డీ హైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది.
పెద్దలు తమ బ్యాగుల్లో ఓఆర్ ఎస్ ప్యాకెట్స్ పెట్టుకుని ఉండండి.. పిల్లకు ఇబ్బంది కలిగినప్పుడు ఉపయోగపడతాయి. ఆట ధ్యాసలో పిల్లలు సరిగా నీరు తాగుతున్నారో లేదో గమనించండి. గంట గంటకు కొద్దిగా నీరు అడిగిమరీ ఇవ్వండి.
సమ్మర్ లో పిల్లలకు స్పైసీ ఫుడ్స్ నుంచి దూరంగా ఉంచండి. ఉప్పు, కారం తగ్గించండి. దాహం కలిగించే పదార్ధాలతో పాటు.. ఫ్రిజ్ వాటర్ కూడా పిల్లలకు పట్టించకండి. మట్టికుండ నీరుతాగితే ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు ఇంకా మంచిది. ఇక పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే.. వడదెబ్బ నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు.