హోటల్‌నో, రెస్టారెంట్‌ (restaurant)నడపడం అంత వీజీ కాదు. పేరుతో పాటు సర్వ్‌ చేసే ఫుడ్‌ ఐటమ్స్‌(Food) కూడా డిఫరెంట్‌గా ఉండాలి. రెస్టారెంట్‌ థీమ్‌ వెరైటీగా ఉండాలి. అప్పుడే కస్టమర్లను అట్రాక్ట్‌ చేయగలుగుతారు! ఇట్టాగే అమెరికాలోని(America) ఓ రెస్టారెంట్‌కు క్యాచీ నేమ్‌ పెట్టారు. పేరు వింటే మీ గుండె జలదరించడం ఖాయం. ఆ రెస్టారెంట్‌ పేరేమిటనుకున్నారు...? హార్ట్‌ ఎటాక్‌(Heart Attack).. ఇదేం పేరని కంగారుపడకండి.. పేరే కాదు.. పేరుకు తగ్గట్టే హోటల్‌ థీమ్‌ మొత్తం హాస్పిటల్‌లాగే(Hospital) ఉంటుంది. అక్కడి ఫుడ్‌ ఐటమ్స్‌ను అదే పనిగా తింటే హార్ట్ ఎటాక్‌ వస్తుందేమోనన్న డౌట్‌ వచ్చేస్తుంది.

ఎందుకంటే ఇక్కడ దొరికే బైపాస్‌ బర్గర్లు(Burger) తింటే 10 వేల క్యాలరీల శక్తి వస్తుంది. బైపాస్‌ బర్గర్‌ అంటే బర్గర్ల దొంతర.. అంటే ఒకదానిపై మరొకటి పెడతారు. వాటిలో ఉంచే పదార్థాల మోతాదును కూడా పెంచుకుంటూ పోతారు. కేవలం బర్గర్‌లు మాత్రమే కాదు, అక్కడ దొరికే ప్రతీ ఫుడ్‌ ఐటెమ్‌లో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. 2005లో జాన్‌ బాసో అనే వ్యక్తికి ఈ ఐడియా వచ్చింది. వెంటనే హార్ట్‌ ఎటాక్‌ గ్రిల్ అనే రెస్టారెంట్‌ను స్టార్ట్‌ చేశాడు. కొన్ని వారాల్లోనే రెస్టారెంట్‌కు డిమాండ్‌ వచ్చేసింది. రెస్టారెంట్‌లో అడుగుపెట్టిన తర్వాత ఓ నిమిషం పాటు మనం వచ్చింది హాస్పిటల్‌కా? లేక రెస్టారెంట్‌కా? అన్న అనుమానం కలుగుతుంది. తినడం కోసం అక్కడికి వెళ్లిన వారు కంపల్సరీగా పేషెంట్స్‌లా గౌనులు వేసుకుని వెళ్లాలి. అది రూలక్కడ! అక్కడి వెయిటర్లేమో నర్సులుగా, డాక్టర్లుగా డ్రెస్‌ చేసుకుంటారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్స్‌ను ప్రిస్కిప్షన్‌ అంటారు.

ఫుడ్‌ ఐటెమ్స్‌ను ఆర్డర్‌ చేసిన తర్వాత తినకుండా వచ్చేస్తే ఊరుకోరు. చిన్నపాటి శిక్ష కూడా వేస్తారు. నర్సులతో సరదాగా బెల్ట్‌తో కొట్టిస్తారు. ఇదేం వెర్రిరా బాబూ అని అనిపిస్తుంది కదూ! ఇంకో విషయం కూడా ఉంది. 350 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న వారికి రెస్టారెంట్‌ నిర్వాహకులు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. వారు ఎంత తిన్నా ఫ్రీనే! బిల్లు అసలు వసూలు చేయరు! ఈ రెస్టారెంట్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉన్నమాట నిజమే కానీ, కొన్ని విమర్శలు కూడా వినిపిస్తుంటాయి. జనం ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నదని, విపరీతమైన జంక్‌ను ఎంకరేజ్‌ చేసేలా రెస్టారెంట్‌ ఉందని కొందరు అంటుంటారు. జనం మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. అక్కడ తింటే ఆరోగ్యానికి హానీ కలుగుతుందని తెలిసీ చాలా మంది రెస్టారెంట్‌కు వెళుతున్నారు. అందుకే రోజురోజుకీ కస్టమర్ల సంఖ్య పెరుగుతూ పోతోంది.

Updated On 8 Sep 2023 3:50 AM GMT
Ehatv

Ehatv

Next Story