చీటికి మాటికి ఏదొ ఒక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా..? వచ్చిన జబ్బు త్వరగా తగ్గడంలేదా..? అయితే మీలో ఇమ్యునిటీ(Immunity) చాలా తక్కువ ఉన్నట్టు లెక్క,. మరి రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి. సింపుల్ గా ఇలా చేయండి.. మీ ఇమ్యునిటీ వేగంగా పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలంటే..? ఏ కాలంలోనైనా జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే.. మన జీవన శైలిలో మార్పులు ఉండాలి. చిన్నచిన్న రోగాలకే హాస్పిటల్స్ కు పరుగులు తీస్తుంటాం. మరి అలా జరగకుండా ఉండాలన్నా..

చీటికి మాటికి ఏదొ ఒక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా..? వచ్చిన జబ్బు త్వరగా తగ్గడంలేదా..? అయితే మీలో ఇమ్యునిటీ(Immunity) చాలా తక్కువ ఉన్నట్టు లెక్క,. మరి రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి. సింపుల్ గా ఇలా చేయండి.. మీ ఇమ్యునిటీ వేగంగా పెరుగుతుంది.

రోగ నిరోధక వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలంటే..? ఏ కాలంలోనైనా జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే.. మన జీవన శైలిలో మార్పులు ఉండాలి. చిన్నచిన్న రోగాలకే హాస్పిటల్స్ కు పరుగులు తీస్తుంటాం. మరి అలా జరగకుండా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా... ఏమాత్రంఖర్చు లేకుండా ఇమ్యునిటీ(Immunity)ని పెంచుకోవచ్చు. మరి ఏం చేయాలో చూద్దాం.

వంటింట్లో దొరికే పదార్ధాలతోనే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అది కూడా మూడు పదార్ధాలతో ఇట్టే ఇమ్మునిటీ పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంత అవుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి పాలు. పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మనిషిని దృఢంగా చేస్తాయి. రోజుకు ఒక్క గ్లాసు పాలు తీసుకోండి.. ఎముకలు దృఢంగా మారి.. మనిషి బంలంగా తయారవుతారు.

పాల(Milk) వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇక పాలతో పాటు గా కాంబినేషన్ లో మరికొన్ని పదార్ధాలు తీసుకుంటే.. మనలో శక్తి మరింతగా పెరుగుతుంది. పాలలో స్పూన్ తేనె, దాల్చినచెక్క పొడి చిటికెడు కలుపుకుని రోజూ తాగితే రోగాలు దరి చేరవు. రోగనిరోధక వ్యవస్థ రెట్టింపు శక్తి చేకూరుతుంది.

అంతే కాదు ఇలా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ మాయం అవుతాయి. జీర్ణ క్రియ బలపడటం వల్ల.. మనిషిలో మలబద్ధకం సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఎంతో కాలంగా బాధిస్తున్న గ్యాస్, ఎసిడిటీ ఇబ్బంది నుంచి కూడా బయట పడవచ్చు.

ఇక నేటి జీవన శైలి వల్ల మనిషిలో ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్త ప్రసరణను ఆపే కొవ్వుగడ్డలను ఇది కరిగిస్తుంది. దాంతో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి.. హార్ట్ ఎటాక్ లుతగ్గుతాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Updated On 20 April 2023 12:01 AM GMT
Ehatv

Ehatv

Next Story