కొంతమంది అస్సలు బొప్పాయి(Papaya) పండు జోలికే వెళ్లరు. బోప్పాయి తింటే మంచిది కాదు అనుకుంటారు.. వేడి చేస్తుందని.. రకరకాల కారణాల వల్ల బోప్పాయి తినడానికి ఇష్టపడరు. కాని రోజు వారి డైట్‌లో బొప్పాయినిరోజు తమ డైట్ లో చేర్చడం వల్ల వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు ఆ పండును అస్సలు నిర్లక్ష్యం చేయలేరు.

బొప్పాయి పండు బోలెడన్ని ఫైబర్‌లు, విటమిన్-C, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను(Cholesterol) తగ్గించడంలో ఉపయోగపడతాయి. అంతే కాదు బొప్పాయిలో ఉండే విటమిన్ 'సి'(Vitamin C) గుండె సంబంధిత జబ్బులను తగ్గించడంలోను సహాయపడతాయి.

బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని బోప్పాయి ఈజీగా తొలగిస్తుంది.

బొప్పాయి విటమిన్ ఎ, బీటా కెరోటిన్, జియాక్సంతిన్, సైప్టోక్సంతిన్, లుటిన్ వంటి విటమిన్లను, ఫ్లేవనాయిడ్లు ను కలిగి ఉండటం వల్ల వయస్సు పెరగటం వల్ల వచ్చే కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే జియాక్సంతిన్, లుటిన్ లు గ్లాకోమా, కంటిశుక్లం వంటి దీర్ఘకాలిక కంటి వ్యాధులను నివారించడంలోను సహాయపడతాయి.

బొప్పాయి పండు మన శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటంలో మరియు ఇన్ఫ్లమేషన్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది. కొన్ని జంతు పరిశోధనల ప్రకారం బొప్పాయి పండు ఒబేసిటీ అంటే ఊబకాయం వచ్చే రిస్క్ ను కూడా తగ్గించటంలో దోహదపడుతుంది

బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.

Updated On 17 Sep 2023 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story