తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్(TS Residentail School) లో ఫుడ్ పాయిజన్‌పై(Food Poison) హైకోర్టులో విచారణ జరిగింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించారు. SC, ST, BC, మైనారిటీ బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని..

Residential School Food Poison Case
తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్(TS Residentail School) లో ఫుడ్ పాయిజన్‌పై(Food Poison) హైకోర్టులో విచారణ జరిగింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించారు. SC, ST, BC, మైనారిటీ బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని.. నాణ్యమైన ఆహారం లేకుండా.. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని.. మంచినీరు, కిచెన్, మరుగుదొడ్లు పరిశుభ్రత లేక విద్యార్థులు కడుపు నొప్పి, తలనొప్పి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటీషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6 కు వాయిదా వేసింది.
