వనపర్తి జిల్లా(Wanaparthy) మదనాపురం గోవిందహళ్లీకి చెందిన గొల్ల తిరుపతయ్య(Golla Thirupathaiah) ఎగ్ బోండా(Egg Bajji) తింటూ ప్రాణాలు కోల్పోయాడు. సహజంగా గుడ్డు బజ్జీలు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే దీన్ని మరింత ఇష్టంగా తింటుంటారు.

Egg bajji
మనిషి ప్రాణానికి విలువ లేదనే వాస్తవానికి ఈ ఘటనే నిదర్శనమేమో.. చావు ఎప్పుడు ఎలా వస్తుందో అంతుపట్టదు. అకస్మాత్తుగా మరణాలు చోటు చేసుకుంటాయి. కొందరు ఎంతో దిట్టంగా, ఆరోగ్యంగా ఉన్నవారు సైతం మృత్యువాత పడడంతో దిగ్భ్రాంతి చెందుతుంటాం. క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడం మనసులను కలిచివేస్తుంటుంది. ఒక్కోసారి మనం ఇష్టంగా తినే ఆహార పదార్థాలు కూడా మనకు చావును కొని తెస్తాయంటే నమ్మలేం. ఈ తరహాలోనే ఓ ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఎగ్ బోండా తింటూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే..
వనపర్తి జిల్లా(Wanaparthy) మదనాపురం గోవిందహళ్లీకి చెందిన గొల్ల తిరుపతయ్య(Golla Thirupathaiah) ఎగ్ బోండా(Egg Bajji) తింటూ ప్రాణాలు కోల్పోయాడు. సహజంగా గుడ్డు బజ్జీలు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే దీన్ని మరింత ఇష్టంగా తింటుంటారు. తిరుపతయ్యకు కూడా ఎగ్ బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం తన ఇంటి ముందే కూర్చొని తిరుపతయ్య ఎగ్ బజ్జీలు తింటున్నాడు.ఇంతలోనే ఓ బజ్జీ తిరుపతయ్య గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో తిరుపతయ్యకు ఊపిరి ఆడక కింద పడిపోయాడు. ఇది గమనించిన తిరుపతయ్య భార్య సువర్ణ భర్త తిరుపతయ్య గొంతు నుంచి బజ్జీని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. సువర్ణ కేకలు విన్న చుట్టుపక్కలవారు కూడా వెంటనే పరిగెత్తుకొచ్చి గొంతులో ఇరుక్కున్న బజ్జీని తీసేందుకు శ్రమించారు. చివరకు తిరుపతయ్య గొంతు నుంచి బజ్జీని బయటకు తీసినాకానీ అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. బజ్జీ తీసేందుకు ఆలస్యం కావడంతో ఊపిరాడక తిరుపతయ్య ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఎగ్ బోండాతో ప్రాణాలు పోయాయని స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.
