మామూలుగా ఓ హోటల్‌కు వెళ్లి మనకు కావాల్సిన ఫుడ్డును ఆర్డర్‌ చేస్తే అరగంటలోపే మన టేబుల్‌ మీదకు వచ్చేస్తుంది. హోటల్‌లో రద్దీ ఎక్కువగా ఉంటే ఇంకో పది పదిహేను నిమిషాలు ఆలస్యమవుతుందేమో...! కానీ ఇంగ్లాండ్‌(England) లోని ఓ ప్రఖ్యాత పబ్‌(PUB) కథ వేరు! అందులోని ఆదివారం స్పెషల్‌ డిష్‌ను తినాలంటే నాలుగేళ్లు ఎదురుచూడాల్సి ఉంటుంది. అంటే ఇవాళ మనం బుక్‌ చేసుకుంటే నాలుగేళ్ల తర్వాత ఆ వంటకాన్ని రుచి చూసే భాగ్యం లభిస్తుంది. బ్రిస్టల్‌లో(Bristol) ఉన్న ఈ పబ్‌ పేరు ది బ్యాంక్‌ టావెర్న్‌ పబ్‌(Tavern Pub)..

మామూలుగా ఓ హోటల్‌కు వెళ్లి మనకు కావాల్సిన ఫుడ్డును ఆర్డర్‌ చేస్తే అరగంటలోపే మన టేబుల్‌ మీదకు వచ్చేస్తుంది. హోటల్‌లో రద్దీ ఎక్కువగా ఉంటే ఇంకో పది పదిహేను నిమిషాలు ఆలస్యమవుతుందేమో...! కానీ ఇంగ్లాండ్‌(England) లోని ఓ ప్రఖ్యాత పబ్‌(PUB) కథ వేరు! అందులోని ఆదివారం స్పెషల్‌ డిష్‌ను తినాలంటే నాలుగేళ్లు ఎదురుచూడాల్సి ఉంటుంది. అంటే ఇవాళ మనం బుక్‌ చేసుకుంటే నాలుగేళ్ల తర్వాత ఆ వంటకాన్ని రుచి చూసే భాగ్యం లభిస్తుంది. బ్రిస్టల్‌లో(Bristol) ఉన్న ఈ పబ్‌ పేరు ది బ్యాంక్‌ టావెర్న్‌ పబ్‌(Tavern Pub).. ఈ పబ్‌లో ఆర్డర్‌ చేయాలంటే ఓపిక చాలా ఉండాలి. ఆ హోటల్ లో ఉన్న స్పెషల్‌ డిష్‌ను తినాలంటే ఆ మాత్రం ఓపిక అవసరం. బుకింగ్‌ టైమ్‌ నాలుగేళ్లు పడుతుందన్నమాట! ఇంత సుదీర్ఘమైన ఎదురుచూపులు చూసే హోటల్‌ ప్రపంచంలోనే మరోటి లేదు.

ఆ హోటల్లో సండే స్పెషల్ రోస్ట్ బుక్ చేసుకుంటే మన టైమ్ వచ్చేసరికి కనీసం నాలుగేళ్లు పడుతుంది. అన్నేళ్ల పాటు ఆగాలంటే నిజంగానే చాలా చాలా ఓపిక ఉండాలి. ఫుడ్‌ లవర్స్‌ అంత కాలం ఎదురుచూడటమన్నది ఓ రకంగా టార్చరే! ది బ్యాంక్‌ టావెర్న్‌ పబ్‌లో ప్రతీ ఆదివారం రుచికరమైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. నోరూరించే ఆ సండే రోస్టు వంటకానికి 2018లో బ్రిస్టల్‌ గుడ్‌ఫుడ్‌ అవార్డుల్లో ఉత్తమ సండే లంచ్‌ అవార్డుతో పాటు అనేక అవార్డులు దక్కించుకుంది. నాలుగేళ్ల కిందటి వరకు ఈ హోటల్‌లో ఆర్డర్లనీ టైమ్‌కే డెలివిరీ అయ్యేవి.

ఎప్పుడైతే కరోనా వైరస్‌ వచ్చిందో అప్పటి నుంచి పరిస్థితి మారింది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో పబ్‌ మూసివేసి ఉండటంతో ఆ సమయంలో వచ్చిన ఆర్డర్లన్నీ పెండింగ్‌లో పడిపోయాయన్నమాట! ప్రస్తుతానికి పబ్‌వారు నాలుగేళ్లు వెనుకబడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను ఒక్కొక్కటిగా క్లియర్‌ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ఈ హోటల్లో ఇప్పుడు సండే రోస్ట్ ఆర్డర్ చేసేవారు నాలుగేళ్లు ఎదురుచూడక . అందుకే ఈ హోటల్ యాజమాన్యం ప్రస్తుతానికి బుకింగ్ లను పూర్తిగా నిలిపివేసింది.

Updated On 28 July 2023 12:13 AM GMT
Ehatv

Ehatv

Next Story