సమ్మర్ వచ్చిందంటే మార్కెట్లో తాటి ముంజలు దర్శనమిస్తాయి . సీజనల్ పండ్లలో ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజల వల్ల మనకు బోలేడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే నమ్మండి. వీటినే ఐస్ ఆపిల్ అని ఇంగ్లీష్ లో అంటాం. సిటీలో కంటే ఏదైనా పల్లెటూర్ లో అయితే ముంజలు ఇంకా ప్రెష్ గా ..ఎక్కువగా అందుబాటులో ఉంటాయి . సమ్మర్ సీజన్ లో దొరికే ఈ ముంజలను అస్సలు మిస్ కాకండి ..సమ్మర్ సీజన్ లో వచ్చే ఆరోగ్య […]
సమ్మర్ వచ్చిందంటే మార్కెట్లో తాటి ముంజలు దర్శనమిస్తాయి . సీజనల్ పండ్లలో ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజల వల్ల మనకు బోలేడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే నమ్మండి. వీటినే ఐస్ ఆపిల్ అని ఇంగ్లీష్ లో అంటాం. సిటీలో కంటే ఏదైనా పల్లెటూర్ లో అయితే ముంజలు ఇంకా ప్రెష్ గా ..ఎక్కువగా అందుబాటులో ఉంటాయి . సమ్మర్ సీజన్ లో దొరికే ఈ ముంజలను అస్సలు మిస్ కాకండి ..సమ్మర్ సీజన్ లో వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే ....ముంజలు తినడమే ఓ మంచి పరిష్కారం.
ముంజలు ఆరోగ్య ప్రయోజానాలే కాదు ఇవి బరువు తగ్గాలనుకునే వారికి ఓ వరం అనే చెప్పుకోవాలి. వీటిని తినడం వల్ల అనవసరపు కాలరీలు బాడీలోకి చేరవు . పైగా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిదని ... ముఖ్యంగా గర్భిణి స్త్రీలు తమ మెటబాలిజం రేట్ ను బాగా మెయింటన్ చేసుకోవడంలో ముంజలు చాలా ఉపయోగపడుతాయని వైద్యనిపుణులు అంటున్నారు. వీటిలో విటమిన్ బి , ఫోలేట్ , విటమిన్ కే, విటమిన్ ఏ, జింక్ , ఐరన్ లు ఉన్నాయి. సమ్మర్ లో బాడీ డీ హైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది.. అయితే ముంజలో వాటర్ కంటెంట్ ఉండటం వల్ల వీటిని తినడంతో హైడ్రేట్ అవుతుంది. వీటిల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
వేసవిలో విరివిగా మనకు అందుబాటులో ఉండే ఈ పండ్లు చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. కానీ ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. శరీరానికి తగినంత కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. మరోవైపు ఇతర సీజన్ల కంటే ఈ సీజన్ లో ఎక్కువ అలసటకు గురి అవుతుంటారు. ఈ సీజన్ లో శరీరం నుంచి నీటిని కోల్పోవడం వల్ల వచ్చే నీరసం, అలసటను తాటి ముంజలు నివారించి, తక్షణ శక్తిని అందిస్తుంది. తాటిముంజల్లో ఉండే ఫైటో కెమికల్స్, ఆంతోసినిన్ శరీరంలో ట్యూమర్స్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా నిరోధిస్తుంది ఇది. అందుకే ఇది ఆరోగ్యానికి గ్రేట్ హెల్త్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు.