ఓ చేప గుడ్డు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చెప్తారు. చేపగుడ్లతో తయారుచేసిన వంటకం తినాలంటే జేబు నిండా డబ్బులు ఉండాల్సిందేనంటున్నారు. ఖరీదైన వంటకంగా దీనికి పేరు వచ్చింది. అవే 'కేవియర్‌ గుడ్లు'. సర్జన్‌ అని పిలిచే చేపల నుంచి ఇవి వస్తాయి. కానీ ఈ చేపలు గుడ్లు పెట్టాలంటే 7-15 ఏళ్ల సమయం పడుతుంది. సర్జన్‌ చేపల్లో 26 జాతులు ఉంటాయి. వీటి గుడ్లు వివిధ బ్రాండ్లలో అమ్ముతారు.

ఓ చేప గుడ్డు(Fish Egg) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చెప్తారు. చేపగుడ్లతో తయారుచేసిన వంటకం తినాలంటే జేబు నిండా డబ్బులు ఉండాల్సిందేనంటున్నారు. ఖరీదైన వంటకంగా దీనికి పేరు వచ్చింది. అవే 'కేవియర్‌ గుడ్లు'(Caviar eggs). సర్జన్‌(surgeon) అని పిలిచే చేపల నుంచి ఇవి వస్తాయి. కానీ ఈ చేపలు గుడ్లు పెట్టాలంటే 7-15 ఏళ్ల సమయం పడుతుంది. సర్జన్‌ చేపల్లో 26 జాతులు ఉంటాయి. వీటి గుడ్లు వివిధ బ్రాండ్లలో అమ్ముతారు. కేవియర్‌ గుడ్ల్ కోసమే సర్జన్‌ ఆడ చేపలను పెంచుతారు. కేవియర్‌ గుడ్లు నారింజ, నలుపు, ఆలివ్ రంగులలో ఉంటాయి. రోమన్, గ్రీకుల రాజుల కాలంలో ఈ గుడ్లతో వంటకాలు చేసేవారని దీంతో ఈ వంటకానికి రాయల్‌ డిష్(Royal Dish) అనే పేరువచ్చిందని చెప్తారు.

కేవియర్‌ గుడ్డు ధరను చూస్తే 1 ఔన్స్ అంటే 30 గ్రాముల కేవియర్ గుడ్లు ధర సుమారు రూ. 5 వేల నుండి రూ. 8 వేల వరకు ఉంటుంది. ఈ సర్జన్‌ చేప ధర రూ.24 లక్షలకుపైమాటే. చేప గుడ్డు నాణ్యతను బట్టి ఈ ధర ఉంటుంది. అయితే సర్జన్‌ చేప గుడ్లు పెట్టడానికి 7-15 సంవత్సరాలు పడుతుంది. గతంలో ఈ చేపలను వేటాడి పట్టుకొచ్చేవారని.. రానురాను అవి అంతరించిపోతున్నాయన్న ఆలోచనతో వీటిని వేటాడటంపై నిషేధం విధించారు. స్టర్జన్ చేపలు ఉత్పత్తి చేసే కేవియర్ గుడ్లు ఫ్రీజర్‌లో మాత్రమే నిల్వ చేస్తారు. ఎందుకంటే వాటిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచలేము, అయితే గుడ్లు ఎక్కువసేపు నిల్వ చేస్తే దాని నాణ్యత, రుచి పెరుగుతుందని అన్నారు. కేవియర్ గుడ్లలో పోషకాలు కూడా మెండుగానే ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, విటమిన్ సి, ఎ, ఇ, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం కూడా ఈ గుడ్డులో కావాల్సినంత ఉన్నాయి.

Updated On 13 Feb 2024 3:04 AM GMT
Ehatv

Ehatv

Next Story