చెరుకు రసం తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తోంది . చెరుకు రసం తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. కామెర్ల వ్యాధితో బాధ‌ప‌డేవారు చెరుకు ర‌సం తాగడం వలన కొంత మేరకు ఉపశమనం పొందవచ్చు.

సమ్మర్‌ సీజన్‌ రానే వచ్చింది. ఇక నిమ్మరసం , చెరుకు రసాలకు బోలెడంతా డిమాండ్ ఉంటుంది. ఈ సమ్మర్ లో రోడ్డుకి ఇరువైపులా ఈ చెరుకు రసం బండ్లునే కనిపిస్తాయి. అయితే ఈ చెరుకు రసాన్ని తీసుకోవడం వలన హెల్త్‌కి చాలా మంచిదంటున్నారు నిపుణులు. . ఎందుకంటే.. డీహైడ్రేషన్, అలసట ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెరుకు రసం తప్పకుండా తీసుకోవాలంటున్నారు .అంతేకాకుండా చెరుకు శరీరానికి ఎప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది. చెరకు రసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ......

చెరుకు రసం తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తోంది . చెరుకు రసం తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. కామెర్ల వ్యాధితో బాధ‌ప‌డేవారు చెరుకు ర‌సం తాగడం వలన కొంత మేరకు ఉపశమనం పొందవచ్చు. జ్వరం వచ్చినప్పుడు చెరుకుర‌సం తాగ‌డం వ‌ల్ల కోల్పోయిన ప్రొటీన్ల‌ను తిరిగి అందిస్తుంది. ఇక చెరుకు ర‌సం దాహం తీర్చ‌డ‌మే కాకుండా తిన్న ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుందంటున్నారు నిపుణులు . అంతేకాదు డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారు చెరుకు ర‌సం తాగాలా వ‌ద్దా అనే డైల‌మాలో ఉంటారని తెలిపారు.చెరుకు ర‌సం ర‌క్తంలోని చెక్క‌ర స్థాయిల‌పై ప్ర‌భావం చూప‌ద‌ని వైద్యులు వెల్ల‌డించారు.

చెరుకు ర‌సం ప్రోటీన్ లెవ‌ల్స్‌ని పెంచుతుంది. లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక చెరుకులో క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఎల‌క్ట్రోలైట్స్, మెగ్నీషియం, ఐర‌న్ వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయని తెలిపారు. చెరుకు ర‌సం జ‌లుబు, గొంతునొప్పి, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుందని తెలిపారు. చెరుకు ర‌సం తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది . ఇక అస‌ల‌ట‌, ఒత్తిడి, నీర‌సంగా అనిపించిన‌ప్పుడు రెండు గ్లాసుల షుగ‌ర్‌కేన్ తాగితే త‌క్ష‌ణ‌మే ఎన‌ర్జీ సొంతం చేసుకోవచ్చు.

చెరుకు రసంతో మహిళలకు చాలా ప్రయోజనాలున్నాయి. .ముఖ్యంగా చెరకు రసం సంతానోత్పత్తికి మంచిగా పని చేసే బూస్టర్ అని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొత్తగా తల్లి అయిన వాళ్లలో పాల ఉత్పత్తిని పెంచుతుందట. ఇక మగవారిలో స్పెర్మ్ నాణ్యతని మెరుగుపరచడానికి చెరుకు రసం ఉపయోగపడుతుందట. మహిళలు పీరియడ్స్‌లో వచ్చే నొప్పికి మందుగా చెరుకు రసాన్ని వాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు తాగితే ఆ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. అలాగే మూత్రపిండాలు సక్రమంగా పని చేయడానికి చెరుకు రసం సహాయపడుతుంది. దాంతోపాటు కాలేయ పనితీరు ఆప్టిమైజ్ అవుతుంది. కామెర్ల చికిత్సలో కూడా చెరుకు రసం చక్కగా పనిచేస్తుంది.

ఇక అందం విషయానికొస్తే స్మూత్, మృదువైన చర్మం కావాలనుకుంటే చెరుకు రసాన్ని తాగడం చాలా మంచిది. ఇది తాగితే మృదువైన చర్మం సొంతం అవుతుంది. అలాగే మొటిమలు పూర్తిగా నివారిస్తుంది. వారంలో మూడు సార్లు చెరుకు రసం తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని విధాలుగా చాలా మంచిది. ఎందుకంటే ఇది సహజ డిటాక్స్‌గా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Updated On 7 March 2023 6:18 AM GMT
Ehatv

Ehatv

Next Story