కుమారి ఆంటీ(Kumari aunty) ఇప్పుడు తెలుగు రాస్ట్రాల్లో ఫేమస్. అంతెందుకు తెలుగు వారు ఉంటున్న అన్ని దేశాల్లో ఈ కుమారి ఆంటీ క్రేజ్ ఓ రేంజ్ కు వెళ్లింది. సోషల్ మీడియా(Social media), న్యూస్ ఛానళ్లలో కుమారి పేరే మారుమాగుతోంది. మొన్న ట్రాఫిక్ కి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న కారణంతో హైదరాబాద్ పోలీసులు ఆమె వాహనాన్ని అనుమతించకపోవడంతో ఆమెకు మద్దతుగా పలువురు నెటిజన్లు నిలిచారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) హామీ ఇవ్వడమే కాకుండా తాను కూడా వచ్చి తింటానని చెప్పడంతో మరింత క్రేజ్ వచ్చింది.

ఇంత తతంగం జరిగాక మీడియా గమ్మున ఉంటుందా.. మైకులు, కెమెరాలు వేసుకొని ఆవిడతో యాంకర్లు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూల్లో పలు విషయాలను ఆమె వెల్లడిస్తోంది. సెలబ్రిటీలు(Celebrities) కూడా తన కూరల రుచులను ఆస్వాదిస్తున్నారని చెప్పుకొచ్చింది. అందులో పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారట. టాలీవుడ్ స్టార్ హీరో 'జూ.ఎన్టీఆర్'(Jr NTR) కూడా తన కూరులను రుచి చూశారని ఆమె తెలిపింది. డ్రైవర్‌ని పంపించి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ నుంచి కర్రీస్‌ను జూ.ఎన్టీఆర్ తీసుకెళ్తారని వెల్లడించింది. ఇక ప్రముఖ కమెడియన్ ఆలీ(Ali Mohammad) అయితే నేరుగా అక్కడికి వచ్చి ఆమె కర్రీస్‌ను తీసుకుని వెళ్లారట. ఇలా ఎందరో స్టార్లు ఆమె చేతి వంటకు అలవాటుపడ్డారని తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ కూడా అక్కడికి వస్తారన్న వార్తలతో ఇక్కడ జనం పోటెత్తారు. యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, కస్టమర్ల తాకిడితో అక్కడ రద్దీ పెరిగిపోతోంది. ఒక పక్క కూరలు, అన్నంతో పాటు పలు పదార్థాలు వడ్డిస్తూ అందరిని నవ్వుతూ పలకరిస్తూ.. సమయం దొరికినప్పడల్లా ఆమె పలు మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ' మీ బిల్లు వెయ్యి రూపాయలండి.. రెండు లివర్‌లు ఎక్స్ట్రా' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వ్యవహారం ఇక్కడిదాకా వచ్చిందని అంటున్నారు. అయితే ఆమెతో పాటు పక్కనే నడుపుతున్న ఇతర ఫుడ్ సెంటర్ ఓనర్లు మాత్రం కుమారి ఆంటీ వల్ల తమ బిజినెస్ దారుణంగా పడిపోయిందని వాపోతున్నారు.