చలికాలం వచ్చిందంటే చాలు .. ఆ సీజన్ కు తగ్గట్టు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి తినే ఆహారం(Food) విషయంలో జాగ్రత్త ఉండటం మంచిది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చల్లటి ఉష్ణోగ్రతలుఉంటాయి కాబట్టి ఎక్కువ సమయం బయట వాతావరణం కంటే ఇంట్లో గడపడం కారణంగా తినే ఆహారంపై మరియు మానసిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి.
చలికాలం(Winter) దగ్గరలోనే ఉంది. వర్షాకాలం అయిపోవస్తోంది. ఇక చలికాలంలో తినదగని పదార్ధాలుఏంటి..? తినకూడని పదార్ధాలు ఏంటీ తెలుసుకుందాం..?
చలికాలం వచ్చిందంటే చాలు .. ఆ సీజన్ కు తగ్గట్టు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి తినే ఆహారం(Food) విషయంలో జాగ్రత్త ఉండటం మంచిది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చల్లటి ఉష్ణోగ్రతలుఉంటాయి కాబట్టి ఎక్కువ సమయం బయట వాతావరణం కంటే ఇంట్లో గడపడం కారణంగా తినే ఆహారంపై మరియు మానసిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి.
చలికాలం వేడి వేడిగా తినాలి అనిపిస్తుంటుంది. అయితే అందుకు తగ్గట్టు ఇంట్లో చేసుకోలేక బయటకు వెళ్ళితింటుంటాం.. కాని అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. వాతావరణం చల్లగా ఉందని స్ట్రీట్ ఫుడ్స్(Street Food) ఎక్కువగా తింటూ ఉంటారు వీటిని అధికంగా తినడం కారణంగా క్యాన్సర్(Cancer) లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రోడ్డు పక్కన అమ్మే వేడివేడి ఆహారాలైన మిరపకాయ బజ్జీలు, చీజ్ లు వంటి వాటిని వీలైనంతవరకు తినకండి.
శీతాకాలంలో వీలైనంతవరకూ ఆహారం తీసుకోవడం లో పరిమితులు పెట్టుకోండి ముఖ్యంగా నూనెతో కూడిన స్నాక్స్‌ను(Oily Snacks) ఎక్కువగా తినకండి. బయట స్ట్రీట్ ఫుడ్స్ లో .. నూనెను ఎక్కువగా మరగబెడుతుంటారు. దాని వల్ల కాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చలికాలం వేడిగామనసు లాగుతుందని..రోజు బయట తినకండి.. కాస్త కంట్రోల్ చేసుకోండి. అలా అని మనసు చంపుకోవలసిన అవసరం లేదు. ఎప్పుడో ఒక సారి తింటే తప్పులేదు మరి.
శీతాకాలంలో ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండే విధంగా చూసుకోండి ముఖ్యంగా కాయగూరలు, పండ్లు, పప్పుధాన్యాల కె అధిక ప్రాధాన్యత ఇవ్వండి. వాతావరణం చల్లగా ఉంటే సూప్ లను తీసుకోవటం మంచిది.
అదేవిధంగా నిమ్మజాతి పండ్లలో తీసుకోవడం మంచిదే వాటిలో ముఖ్యంగా నారింజ, దానిమ్మ, నిమ్మ మరియు జామకాయ ని ప్రతిరోజు తీసుకోవడానికి ప్రయత్నించండి వీటి ద్వారా శరీరం ఆరోగ్యంగా మారడమే కాదు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.