మంచి ఆరోగ్యం కావాలి అంటే ఎక్కువగా ఆకుకూరాలు(Leafy Vegetables) తీసుకోవడం మంచింది. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకు కూరలు.. వీటిని తీసుకోవడం వలన శరీరంలో ఆరోగ్య పరంగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాలకూర(Spinach) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మరి అవేంటో తెలుసుకుందాం..?
మంచి ఆరోగ్యం కావాలి అంటే ఎక్కువగా ఆకుకూరాలు(Leafy Vegetables) తీసుకోవడం మంచింది. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకు కూరలు.. వీటిని తీసుకోవడం వలన శరీరంలో ఆరోగ్య పరంగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాలకూర(Spinach) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మరి అవేంటో తెలుసుకుందాం..?
శరీరానికి అవసరమైన విటమిన్ కె(Vitamin K ) లభిస్తుంది. మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు. పాల కూరలో వివిధరకాల డిజైన్లు, రంగులు, ఫ్లేవర్లున్నాయి. బర్గర్లు, సలాడ్లు, శాండ్ విచ్లు,సూప్స్ లో పాల కూరను ఎక్కువగా వినియోగిస్తారు.ప్రతి రోజూ పాలకూర తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు లభిస్తాయి.
షుగర్(Sugar levels) సమస్యతో బాధపడే వారు పాలకూర తీసుకుంటే చాలా మేలు కలుగుతుంది. అలాగే కిడ్నీ సమస్యలు(Kidney Problems), కిడ్నీలో రాళ్ళు, కాన్సర్, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పాలకూరను తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఆకుకూరల్లోనే పాలకూర ఎంతో మేలైనదీ. అంతే కాదు.. పాల కూర చాలా ప్రత్యేకమైనది కూడా. పాల కూర తినటం వల్ల అనేక రోగాలు మనదరి చేరకుండా చూసుకోవచ్చు. పాల కూరలో యాంటీ ఆక్సీ డెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణసమస్యలు దూరంఅవుతాయి.
పాలకూరలో పోలిక్ యాసిడ్, మాంగనీస్,మెగ్నీషియం, ఐరన్ మరియు విటమిన్ ఏ,సి కె,బి 12 పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.పాలకూరను తరచూ తినడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువనే పరిశోధనలో వెల్లడయింది.పాల కూర తినడం వల్ల రక్తహీనతను తగ్గించే, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది
పాలకూరను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కేలరీలు అందుతాయి. త్వరగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి పాలకూర ఎంత గానో ఉపయోగ పడుతుంది. పాలకూరలో ఫైబర్ కలిగి ఉంటుంది. పాలకూరలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తీసుకుంటే మెదడు పని తీరులో కూడా వేగం పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.