వేసవిలో చాలా మందికి సూర్యరశ్మి(Suntan) మరియు చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు లేదా అలెర్జీలు వస్తుంటాయి. ఇందుకోసం చాలా రకాల మందులు, క్రీములు వాడుతున్నారు. కానీ ఈ సమస్య నుండి చాలా సింపుల్ గా బయటపడే మార్కాలు ఉన్నాయి. అసలు అవి రాకుండానే చూసి.. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు కొన్ని హోం రెమెడీస్‌ని అనుసరించాలి.
వేసవిలో చర్మ అలెర్జీలు(Skin alergies) సర్వసాధారణం. కాని వాటి నుంచి జాగ్రత్తగా ఉండటం అవసరం. అటువంటి పరిస్థితిలో మీరు అనుసరించాల్సిన కొన్ని ఇంటి నివారణ పద్దతులు మీకోసం..?
వేసవిలో చాలా మందికి సూర్యరశ్మి(Suntan) మరియు చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు లేదా అలెర్జీలు వస్తుంటాయి. ఇందుకోసం చాలా రకాల మందులు, క్రీములు వాడుతున్నారు. కానీ ఈ సమస్య నుండి చాలా సింపుల్ గా బయటపడే మార్కాలు ఉన్నాయి. అసలు అవి రాకుండానే చూసి.. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు కొన్ని హోం రెమెడీస్‌ని అనుసరించాలి.
వేసవి వేడి కారణంగా చర్మం బాగా పొడిగా మారుతుంది. అదే సమయంలో, చెమట మరియు దుమ్ము చర్మంపై ఎర్రటి పాచెస్, మొటిమలు లేదా దద్దుర్లు వంటి సమస్యలను కలిగిస్తుంది.
వేసవి తాపం వల్ల చర్మం దురదగా, చికాకుగా ఉంటే పెరుగు ఉపయోగించండి. ఇది మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి, ప్రభావిత ప్రాంతంలో పెరుగును పూయడం వల్ల చల్లదనం వస్తుంది. ఇది సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
ప్రభావిత ప్రాంతంపై ఐస్ ప్యాక్‌ను పూయడం వల్ల వేడి, చర్మం చికాకు లేదా అలెర్జీల విషయంలో ఉపశమనం పొందవచ్చు. దీని కోసం ఐస్ క్యూబ్స్ ను గుడ్డలో వేసి కట్టి దురద ఉన్న చోట అప్లై చేయాలి.
ఎండల వల్ల వచ్చే చర్మ అలర్జీలను దూరం చేసుకోవడానికి అలోవెరా జెల్(Alovera gel) ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్‌ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.
దోసకాయలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సూర్యరశ్మి వల్ల ఏర్పడే పగుళ్లను దూరం చేయడంలో సహాయపడతాయి. దీని కోసం దోసకాయను పేస్ట్ లా చేసి చర్మానికి అప్లై చేయాలి.