యాలకుల(Cardamom) వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..? చూడటానికి చిన్నగా ఉన్నా.. భారీ ప్రయోజనాలు కలిగిఉన్నాయి యాలకులు.. ఇక యాలకుల పొడి(Cardamom Powder), టీ పొడి(Tea Powder) రెండింటినీ కలిపి టీ తయారు చేసి అందులో తేనె(Honey) కలుపుకుని రోజుకు రెండుసార్లు తాగితే నరాలు బలపడతాయి.

* యాలకుల పొడిని తేనెలో కలుపుకుని తింటే నరాల ఒత్తిడి(Nerve Pressure) నుంచి ఉపశమనం లభిస్తుంది. నరాలు బాగా పనిచేస్తాయి. బలం పొందండి.
* యాలకులు, కరివేపాకులతో(Curry Leaves) గ్రైండ్ చేసి పేస్టులా చేసి గేదె పెరుగులో(Curd) కలిపి రోజుకు మూడు పూటలా తింటే అనారోగ్యం దరిచేరదు.
* యాలకుల గింజలను నోటిలో పెట్టుకుని అలా వచ్చే లాలాజలం మింగడం వల్ల నోటి దుర్వాసన మాయం అవుతుంది.
* పాలలో నాలుగు మిరియాలు, కొద్దిగా యాలకులు, కలిపి పేస్ట్ లా చేసి నుదుటిపై రాస్తే తలనొప్పి(Headache) నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ఏలకులు, మిరియాలు, తిప్పలి, దనియాల కషాయాలను కలిపి తీసుకుంటే దగ్గు నయమవుతుంది.
* మెంతులను నానబెట్టి అందులో కొద్దిగా యాలకులు కలిపి నమిలితే కడుపునొప్పి తగ్గుతుంది.
* యాలకులు, జామపండు, మిరియాలపొడి కలిపి మరిగించిన నీళ్లలో వడగట్టి తాగితే వాంతులు, వికారం వెంటనే ఆగిపోతాయి.
* పైనాపిల్ జ్యూస్‌లో యాలకుల పొడి కలిపి తాగితే మూత్ర సంబంధిత రుగ్మతలు నయమవుతాయి. మూత్ర విసర్జన సమస్యతో బాధపడేవారికి మూత్రం స్వేచ్చగా పోతుంది.