నువ్వులు(Sesame seeds) చాలా మందికి ఈ పేరు చెపితే తెలియకపోవచ్చు.. కాని 90 స్ కిడ్స్ కు మాత్రం నువ్వుండలు అంటే వెంటనే నోరు ఊరిపోతుంది. నువ్వులు ఇప్పుడు వాడకం తగ్గింది కాని.. నువ్వులు చిన్నతనంలో బాగా తినేవారు. మరి ఆ నువ్వుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.

నువ్వులు(Sesame seeds) చాలా మందికి ఈ పేరు చెపితే తెలియకపోవచ్చు.. కాని 90 స్ కిడ్స్ కు మాత్రం నువ్వుండలు అంటే వెంటనే నోరు ఊరిపోతుంది. నువ్వులు ఇప్పుడు వాడకం తగ్గింది కాని.. నువ్వులు చిన్నతనంలో బాగా తినేవారు. మరి ఆ నువ్వుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.

నువ్వుల్లో ఫైబర్(Fiber) ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ వ్యవస్థను(Digestive system) మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. అదనంగా గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఊబకాయం మరియు టైప్ 2 మధుమేహం వంటి ప్రమాదాలని తగ్గించడంలో ఫైబర్ సహాయ పడుతుంది. రోజు నువ్వులు తింటె గుండె జబ్బులకు(Heart Problems) కారణమైన అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి.

నువ్వులలోని లిగ్నాన్స్, విటమిన్ E ఇతర యాంటీఆక్సిడెంట్లు మీ రక్త నాళాలు అలాగే రక్త ప్రవాహానికి సహాయపడతాయి. ఒక అధ్యయనంలో, అధిక బ్లడ్ ప్రెషర్ ఉన్న వ్యక్తులకు అది తగ్గడానికి నువ్వులు ఉపయోగపడతాయి.

నువ్వులు ఎముకల(Bones) పెరుగుదలకు ఎంతో పోషణ అందిస్తాయి, గింజల పొట్టులో కాల్షియమ్ ఉంటుంది ఇదే ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరీ ముఖ్యంగా పొట్టు తీసిన నువ్వులు ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి కీలకమైన కాల్షియం పోషకాలను కలిగి ఉంటాయి. నువ్వులను నానబెట్టడం, కాల్చడం లేదా మొలకెత్తడం వంటివి చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి.

నువ్వులు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఊబకాయం, కాన్సర్, గుండె జబ్బులను రాకుండా చేస్తాయి. అంతే కాదు కిడ్నీల ఆరోగ్యానికి కూడా నువ్వులు సహకరిస్తాయి. నువ్వులు మన శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేసుకోడానికి అనేక పోషకాలను అందజేస్తాయి. ఇలా చెప్పుకుంటే వెళ్తే.. నువ్వులలో ఇలాంటి పోషకాలు చాలా ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో ఉపగయోగపడతాయి.

Updated On 9 Sep 2023 5:28 AM GMT
Ehatv

Ehatv

Next Story