తెలంగాణ(Telangana), కేరళలోని(Kerala) ఫారం కోళ్లలో(Farm chickens) యాంటీ బయాటిక్స్‌ను(Anti biotics) తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా(Bacteria) వృద్ధి చెందుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
తెలంగాణ(Telangana), కేరళలోని(Kerala) ఫారం కోళ్లలో(Farm chickens) యాంటీ బయాటిక్స్‌ను(Anti biotics) తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా(Bacteria) వృద్ధి చెందుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. కేరళను సౌత్ జోన్‌గా(South zone), తెలంగాణను సెంట్రల్ జోన్‌గా(Central zone) విభజించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ సైంటిస్టులు(National institute of nutrions scientists) అధ్యయనం చేపట్టారు. పౌల్ట్రీ ఫారంలో కోళ్లకు(Poultry farm hens) అవసరం ఉన్నా లేకున్నా యాంటీ బయాటిక్స్ విచక్షణారహితంగా ఇవ్వడంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(Anti micro boil resistance) వృద్ధి చెందుతోందని నిర్ధారించారు. ఇలాంటి చికెన్‌ను బాగా ఉండికించి తినాలని.. సరిగా ఉడికించకుండా తింటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ మానవుల్లో కూడా వృద్ధి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందులో భాగంగా కేరళ, తెలంగాణలోని 47 పౌల్ట్రీఫామ్స్ లోని 131 శాంపిళ్ల(కోడి రెట్టల)ను సేకరించి, వాటి నుంచి డీఎన్ఏను వేరు చేసి పరిశోధించారు. ఈ కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ ఆరియస్తో పాటు క్లాస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్, క్లేబ్సియెల్లా ఎంటరోకోకస్ ఫెకాలిస్, సూడోమోనాస్ ఎరుగినోసా, బాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు. ఇలాంటి చికెన్‌ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95 శాతం బ్యాక్టీరియా నాశనమవుతుందని తెలిపారు. తెలంగాణతో పోలిస్తే కేరళలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) జన్యువు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.