సాయంత్రంపూట గరమ్‌ గరమ్‌ సమోసా తింటూ, ఓ స్ట్రాంగ్‌ టీ తాగేస్తే అంతకు మించిన రసానుభూతి ఉండదు.. అసలా కాంబినేషన్‌ ఇచ్చే కిక్కే డిఫరెంట్‌! ఇప్పుడు జనాలకు అంత తీరిక లేదు కానీ.. ఒకప్పుడు అయితే ఇరానీ కేఫ్‌లలో ఈవినింగ్‌ ఇదే సీన్‌ కనిపించేది. ఇప్పుడు సమోసా, టీల ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ఇప్పుడు బ్రిటన్‌లో కూడా ఈ కాంబినేషన్‌ తెగ పాపులరయ్యింది. యూత్‌లో అయితే క్రేజ్‌ బాగా పెరుగుతోంది. జనరల్‌గా బ్రిటిషర్లు ఉదయం, సాయంత్రం బిస్కెట్లు తింటారు. […]

సాయంత్రంపూట గరమ్‌ గరమ్‌ సమోసా తింటూ, ఓ స్ట్రాంగ్‌ టీ తాగేస్తే అంతకు మించిన రసానుభూతి ఉండదు.. అసలా కాంబినేషన్‌ ఇచ్చే కిక్కే డిఫరెంట్‌! ఇప్పుడు జనాలకు అంత తీరిక లేదు కానీ.. ఒకప్పుడు అయితే ఇరానీ కేఫ్‌లలో ఈవినింగ్‌ ఇదే సీన్‌ కనిపించేది. ఇప్పుడు సమోసా, టీల ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ఇప్పుడు బ్రిటన్‌లో కూడా ఈ కాంబినేషన్‌ తెగ పాపులరయ్యింది. యూత్‌లో అయితే క్రేజ్‌ బాగా పెరుగుతోంది. జనరల్‌గా బ్రిటిషర్లు ఉదయం, సాయంత్రం బిస్కెట్లు తింటారు. ఇప్పుడు వారి టేస్ట్‌లు మారాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ టీ అండ్‌ ఇన్‌ఫ్యూజన్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమయ్యింది. వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్‌గా ఓట్స్‌తో చేసిన గ్రానోలా బార్స్‌ చాలా బాగుంటుందని మొదటి స్థానం ఇచ్చారు. ఇక సెకండ్‌ ప్లేస్‌ను మన సమోసా కొట్టేసింది. సర్వేలో పాల్గొన్న యూత్‌లో 8 శాతం మంది సమోసాకే ఓటేశారు.

Updated On 9 Feb 2023 3:06 AM GMT
Ehatv

Ehatv

Next Story