చాలా మందికి గుడ్డును రకరకాలుగా తినడం అలవాటు అయ్యి ఉంటుంది. ముఖ్యంగా కొంత మంది హాఫ్ బాయిల్డ్ ఎగ్ తింటే.. మరికొంత మంది పచ్చి గుడ్డు(Raw Egg) ఆరోగ్యానికి మంచిదంటూ.. తినేస్తుంటారు. అయితే పచ్చి గుడ్డు అలా తాగితే ఏమౌతుందో తెలుసా..?
చాలా మందికి గుడ్డును రకరకాలుగా తినడం అలవాటు అయ్యి ఉంటుంది. ముఖ్యంగా కొంత మంది హాఫ్ బాయిల్డ్ ఎగ్ తింటే.. మరికొంత మంది పచ్చి గుడ్డు(Raw Egg) ఆరోగ్యానికి మంచిదంటూ.. తినేస్తుంటారు. అయితే పచ్చి గుడ్డు అలా తాగితే ఏమౌతుందో తెలుసా..?
పచ్చి గుడ్లలో సాల్మోనెల్లా బ్యాక్టీరియా(Salmonella bacteria) ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. పచ్చి గుడ్డు తినడం వల్ల.. కడుపులో నొప్పి(Stomach pain).. వికారాం, వాంతులు(Vomtings), విరోచనాలు లాంటి అనారోగ్యాలు కలుగుతాయి. అతిగా జ్వరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక పచ్చి గుడ్డు చాలా మందికి పడదు. అది అలర్జీకి(Allergy) దారి తీస్తుంది. దాని వల్ల దద్దుర్లు, శ్వాసకోస వ్యాధులతో పాటు.. చర్మవ్యాధులు కలిగిస్తాయి. అందుకే అలర్జీలు ఉన్నవారు పచ్చి గుడ్డు తీసుకోవడం చాలా ప్రమాదం.
పచ్చి గుడ్డు చాలా మందికి జీర్ణం అవ్వదు. దాని వల్ల జీర్ణ సమస్యలు(Digestive problems) ఎక్కువవుతాయి. అంతే కాదు....కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలు పెరుగుతాయి.అందుకే పచ్చిగుడ్డుతో చాలా జాగ్రత్తగా ఉండండి. గుడ్డు సరిగ్గా ఉడకకపోయినా చాలా ప్రమాదం.
ఇక గుడ్డు మురిగిపోయి ఉన్నప్పుడు గమనించకుండా తీసుకున్నారంటే.. అది ఫుడ్ పాయిజన్ కు దారి తీస్తుంది. దాని వల్ల రకరకాల వ్యాధులు కలగడంతో పాటు.. జీర్ణక్రియ పాడైపోతుంది. ప్లూ వంటి జబ్బులు వస్తాయి. అది మనిషిని కుదిపేయడంలో పాటు కోలుకోలేని దెబ్బ తీస్తుంది.
గుడ్డు ఉడకబెట్టి తింటే చాలా మంచిది. అయితే అది సరిగ్గా ఉడికిందా లేదా చూసుకోండి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళల విషయంలో ఆ జాగ్రత్తలు పాటించండి లేకుంటే చాలా ప్రమాదం.