Rice PRice : భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు..!
బియ్యం(Rice) ధరల చూసి సామాన్యులు షాక్‌కు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా బియ్యం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. హెచ్‌ఎంటీ(HMT), సోనామసూరి(Sonamasuri), బీపీటీ ధరలు సగటున క్వింటాల్‌కు రూ. వెయ్యి నుంచి 15వందల వరకు పెరిగిపోయాయి. గత ఏడాది క్వింటాల్‌కు రూ.4,500-5000 మధ్యన ఉన్న క్వింటాల్ ధర ఈ ఏడాదిలో రూ.6,200 వరకు పెరిగింది.
బియ్యం(Rice) ధరల చూసి సామాన్యులు షాక్‌కు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా బియ్యం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. హెచ్‌ఎంటీ(HMT), సోనామసూరి(Sonamasuri), బీపీటీ ధరలు సగటున క్వింటాల్‌కు రూ. వెయ్యి నుంచి 15వందల వరకు పెరిగిపోయాయి. గత ఏడాది క్వింటాల్‌కు రూ.4,500-5000 మధ్యన ఉన్న క్వింటాల్ ధర ఈ ఏడాదిలో రూ.6,200 వరకు పెరిగింది. పాతబియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దీని ధర రూ.7,500 వరకు చేరింది. ఈ సారి పంట దిగుబడి తక్కువ కావడం, పలు రాష్ట్రాల్లో పంట నష్టపోవడం, మరికొన్ని రాష్ట్రాల్లో వరిసాగు తగ్గడం, పెట్టుబడి ఖర్చులు అధికమవడం ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. బియ్యం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.