ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల(Food habits) వల్ల గుండెపోటు వస్తోంది. గుండెపోటుతో(Heart attack) కొందరు అక్కడికక్కడే మరణిస్తున్నారు. ఈ రకమైన గుండె సమస్యలో,మన శరీరం కొన్ని ప్రారంభ లక్షణాలను చూపుతుంది. కంటి పరీక్ష ద్వారా గుండెపోటకు సంబంధించిన సమస్యలను కూడా గుర్తించగలదని మీకు తెలుసా...?

ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల(Food habits) వల్ల గుండెపోటు వస్తోంది. గుండెపోటుతో(Heart attack) కొందరు అక్కడికక్కడే మరణిస్తున్నారు. ఈ రకమైన గుండె సమస్యలో,మన శరీరం కొన్ని ప్రారంభ లక్షణాలను చూపుతుంది. కంటి పరీక్ష ద్వారా గుండెపోటకు సంబంధించిన సమస్యలను కూడా గుర్తించగలదని మీకు తెలుసా...?

క్రమం తప్పకుండా కంటి పరీక్షలు(Eye check up) చేయించుకోవడం వల్ల మీ ఆరోగ్యం, ముఖ్యంగా గుండె ఆరోగ్యం గురించి అనేక విషయాలు తెలుస్తాయి. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. రెటీనా వాస్కులేచర్(Retina Vasculature) అని పిలువబడే కంటి వెనుక భాగంలో ఉన్న రక్తనాళాల వ్యవస్థ గుండెకు దగ్గరగా ఉంటుంది. మన కళ్లకు ఏదైనా సమస్య ఉంటే అది నేరుగా వచ్చే గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అనేక అధ్యయనాల ఫలితాల ప్రకారం, గుండె జబ్బులు(Heart diseases) ఉన్న వ్యక్తులు రెటీనా స్ట్రోక్‌లను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. దీని వలన కంటికి రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ లోపిస్తుంది. దాంతో కణాలు చనిపోతాయి. స్ట్రోక్‌తో పాటు, కంటి స్కాన్‌లు అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి వ్యాధుల సంకేతాలను కూడా ఇలా గుర్తించగలవు.

కంటి లక్షణాలు అనేది గుండెపోటు యొక్క అత్యంత అసాధారణమైన లక్షణాలలో ఒకటి. మీ కళ్ళలో ఒకటి లేదా రెండు కళ్లలో చూపును కోల్పోయేలా చేస్తుంది. అయితే అది పాక్షికంగా కావచ్చు.. లేదు తాత్కాలికంగా కావచ్చు. వైద్యులు చెపుతున్న ప్రకారం, మీ గుండె సరిగ్గా పని చేయనప్పుడు, రెటీనా యొక్క మధ్య భాగం కింద పసుపు డాట్స్ కనిపిస్తాయట.

కళ్లకు రక్తాన్ని సరఫరా చేసే సెంట్రల్ రెటీనా ధమనిలో రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు అమోరోసిస్ ఫ్యూగాక్స్ సంభవిస్తుందని వైద్యులు చెపుతున్నారు. దీని వల్ల కార్నియా చుట్టూ ఒక రింగ్ ఏర్పడుతుంది. ఇది తరచుగా గుండెపోటుకు ఇది ఒక లక్షణంగా గుర్తించవచ్చు. క్లియర్ కార్నియా, ఐబాల్ పైన ఉన్న గుండ్రని కణజాలం, కనుపాప అంచుల వద్ద ఈ వలయాలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.

మీ దృష్టిలో ఆకస్మిక మార్పు కలిగితే... అది గుండెలో కలిగే ఇబ్బంది కావచ్చు అని గుర్తించండి. నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం, స్ట్రోక్ ఉన్నవారిలో మూడింట రెండు వంతుల మంది దృష్టిలో కొంత మార్పు ఉంటుంది. ఇది మెదడులోని భాగాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా, దృష్టి లోపం మరియు అంధత్వం వంటి దృశ్య అవగాహన సమస్యలు సంభవించవచ్చు.

Updated On 26 April 2024 4:20 AM GMT
Ehatv

Ehatv

Next Story