కాఫీని(Coffee) సేవించడం అంత మంచిది కాదని కొందరు అంటుంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఉదయాన్నే వేడి వేడి పొగలు కక్కే కాఫీ తాగితే కానీ దినచర్య మొదలు పెట్టని వారు కోకొల్లలుగా ఉంటారు. కొంతమంది అయితే బెడ్‌ కాఫీని కూడా లాగేస్తుంటారు. అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు నిపుణులు. అసలు కాఫీని ముట్టుకోని వారితో పోలిస్తే కాఫీ తాగేవారికి పార్కిన్సన్స్‌(Parkinson's) వ్యాధి బారిన పడే ముప్పు తక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది.

కాఫీని(Coffee) సేవించడం అంత మంచిది కాదని కొందరు అంటుంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఉదయాన్నే వేడి వేడి పొగలు కక్కే కాఫీ తాగితే కానీ దినచర్య మొదలు పెట్టని వారు కోకొల్లలుగా ఉంటారు. కొంతమంది అయితే బెడ్‌ కాఫీని కూడా లాగేస్తుంటారు. అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు నిపుణులు. అసలు కాఫీని ముట్టుకోని వారితో పోలిస్తే కాఫీ తాగేవారికి పార్కిన్సన్స్‌(Parkinson's) వ్యాధి బారిన పడే ముప్పు తక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. కాఫీ గింజల్లో(Coffee Beans) ఉండే కెఫైన్‌(Caffine) పార్కన్సన్స్‌ వ్యాధి బారిన పడకుండా వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది పరిశోధకులు తెలిపారు. 1,84,024 మంది నుంచి సేకరించిన డాటాను విశ్లేషించిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడే వారి మెదడు పనితీరు నెమ్మదిగా దెబ్బతింటుంది. అసంకల్పితంగా వణకడం, కదలికలు నెమ్మదించటం, కండరాలు బిగుసుకుపోతాయి. దీనికి చికిత్స లేదు. జన్యుపరంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందట. ఇది తగ్గించటంపై పరిశోధకులు దృష్టిసారించారు. ఈ విషయం అలా ఉంచితే రోజూ రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగేవారు ఎక్కువకాలం జీవిస్తారట! ఆస్ట్రేలియాకు చెందిన బేకర్‌ హార్ట్‌ అండ్‌ డయాబెటీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. కాఫీని తగిన మోతాదులో తాగితే గుండె సమస్యలు, డయాబెటీస్, స్ట్రోక్స్ తదితర సమస్యల నుంచి రక్షణ లభిస్తుందట!

Updated On 27 May 2024 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story