ఖమ్మం(Khammam) మార్కెట్‌యార్డులో రైతుల కళ్లల్లో వ్యాపారులు కారం కొడుతున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలు, తెగుళ్లు మిర్చి పంటను దారుణంగా దెబ్బతీసాయి. పంట చేతికొచ్చే సమయంలో మిగ్‌జాం తుఫాన్‌(Strom) మరింత దారుణంగా పంటలు దెబ్బతిన్నాయి. జెండా పాటను నమ్మి మిర్చి తీసుకొచ్చిన రైతులను వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి దారుణంగా మోసం చేస్తున్నారు. అధికారులు, పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వ్యాపారులు, దళారుల ఆగడాలకు అంతులేకుండా పోయింది.

జెండా పాటలో రూ.23,150 పలుకుతున్నా వ్యాపారులు మాత్రం రూ.13 వేల నుంచి 14 వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. జెండా పాట చూసి ఇక్కడికి వచ్చామని అది 23 వేలు ఉంటే ఇక్కడ మాత్రం 13-14 వేలకు మాత్రమే మాత్రమే తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఇంత తక్కువ ధరకు అమ్మితే పురుగుల మందే దిక్కని వారు బాధపడుతున్నారు. 15 రోజులుగా ఖమ్మం మార్కెట్‌కి రైతులు మిర్చి తీసుకొస్తున్నారు. గత వారం రోజుల నుంచి 10వేల బస్తాలకుపైగానే వస్తోంది. మిర్చి(Chilly) కొనుగోళ్లు, అమ్మకాలపై మార్కెట్‌ కమిటీ, యంత్రాంగం పర్యవేక్షణ లేదు. మార్కెట్ కార్యదర్శి బదిలీ కావడంతో మార్కెట్‌లో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. జెండాపాట ధరలు అధికంగా ఉన్నా రైతులకు దాని ఫలితాలు అందడం లేదు. క్వాలిటీ, రంగుని కారణంగా చూపిస్తూ వ్యాపారులు ధర పెట్టేందుకు ముందుకు రావడంలేదు. మంచి నాణ్యత ఉన్న మిర్చికి క్వింటాల్‌కు రూ.15 వేలకు మించి చెల్లించేది లేదని వ్యాపారులు తెగేసిచెప్తున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే మిర్చి కొనే ప్రసక్తేలేదని వ్యాపారులు వెళ్లిపోతున్నారని కర్షకులు ఆవేదన చెందుతున్నారు.

Updated On 5 Jan 2024 3:44 AM GMT
Ehatv

Ehatv

Next Story