టమాటా(tomato) రేట్లు చుక్కలను ఎప్పుడో దాటేసి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. కిలో టమాటాకు 150 రూపాయలు పెట్టాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా? వంద రూపాయలుంటేనే గుండెలు బాదేసుకున్నాం. ప్రభుత్వాలను బండబూతులు తిట్టాం. ఇప్పుడేమో మదనపల్లి మార్కెట్‌లోనే 150 రూపాయలు పలుకుతుందా ఎర్రటి కాయగూర! సరే... ఎలాగూ టమాట ధరాఘాతం గురించి చెప్పుకున్నాం కాబట్టి టమాట పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా కొంచెం చెప్పుకుందాం! టమాట శాస్త్రీయ నాయం సోలనమ్‌ లైకో పెర్సికమ్‌.

టమాటా(tomato) రేట్లు చుక్కలను ఎప్పుడో దాటేసి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. కిలో టమాటాకు 150 రూపాయలు పెట్టాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా? వంద రూపాయలుంటేనే గుండెలు బాదేసుకున్నాం. ప్రభుత్వాలను బండబూతులు తిట్టాం. ఇప్పుడేమో మదనపల్లి మార్కెట్‌లోనే 150 రూపాయలు పలుకుతుందా ఎర్రటి కాయగూర! సరే... ఎలాగూ టమాట ధరాఘాతం గురించి చెప్పుకున్నాం కాబట్టి టమాట పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా కొంచెం చెప్పుకుందాం! టమాట శాస్త్రీయ నాయం సోలనమ్‌ లైకో పెర్సికమ్‌.

ఇవి సోలనేసి(Solanaceae) జాతిరకం నుంచి వచ్చే పళ్లు.. మనం సింపుల్‌గా టమాట అంటున్నాం. ఇవి పండిన తర్వాత ఎర్రగా ఎందుకు కనిపిస్తాయంటే ఇందులో ఉండే లైకోపీన్‌(Lycopene) కారణంగానే! అన్నట్టు టమాటలో కూడా 95 శాతం నీరే(Water) ఉంటుంది. మిగతా అయిదు శాతంలో మేలిక్‌(Malek), సిట్రిక్‌ యాసిడ్లు(Citric Acid), గ్లూటామేట్లు, విటమిన్‌ సీ(Vitamin C), లైకోపిన్‌ వంటి పోషకాలు ఉంటాయి. స్పానిష్‌ పదం టోమాటే నుంచి మనం అంటున్న టమాట వచ్చింది. స్పానిష్‌ పదానికి మూలాలు ఆజ్కెట్‌ భాషలో ఉన్నాయి. ఆజ్కెట్‌లో టమాటాలను జోటోమాటిల్‌ అని అంటారు.

దీన్నే ఇంగ్లీషులో చెబితే ఫ్యాట్‌ వాటర్‌ విత్‌ నావెల్‌(Fat water with novel) అవుతుంది. తొలిసారిగా 1595లో జోటోమాటిల్‌ అనే పదాన్ని పుస్తకాల్లో ఉపయోగించారు. ఈ మాట ఉజ్జాయింపుగా చెప్పడం లేదు. హిస్టరీ ఆఫ్‌ టొమాటో: పూర్‌ మ్యాన్స్‌ ఆపిల్‌ అనే పరిశోధనా పత్రంలో ఉంది. ఐవోఎస్‌ఆర్‌ జర్నల్‌లో రవి మెహతా ఈ విషయాన్ని చెప్పారు. టమాట ఫలానా చోట పుట్టిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సోలనేసి జాతి మొక్కల్లో వేల సంవత్సరాల పాటు జరిగిన పరిణామక్రమంలో ఇవి ప్రస్తత రూపంలోకి వచ్చి ఉంటాయన్నది రవి మెహతా అభిప్రాయం.

కాకపోతే మొదట అంటే క్రీస్తుశకం 700 ప్రాంతంలో దక్షిణ అమెరికాలోని పెరూ, బొలీవియా(Bolivia), చిలీ(chile), ఈక్వెడార్‌ అటవీ ప్రాంతాలలో టమాటాలు పండేవి. ఆండీస్ పర్వతాల్లో అప్పుడెప్పుడో అంటే 20 వేల ఏళ్ల కిందట ఇక్కడ మానవ జాతులు స్థిరపడినప్పుడు ఈ టమాటాలు చాలా చిన్నవిగా , చేదుగా ఉండేవని రవి అంటున్నారు. కొందరు పర్యాటకులు టమాటా మొక్కలను దక్షిణ అమెరికా నుంచి మధ్య అమెరికాకు తీసుకెళ్లారట! అక్కడున్న మయన్‌ నాగరికత ప్రజలు వీటిని పండించడం మొదలు పెట్టారని చరిత్ర చెబుతోంది. అయితే టమాటాలను పండించడం ఎప్పుడు ఎలా మొదలయ్యిందన్నదానికి మాత్రం కచ్చితమైన ఆధారాలు లేవు.

1490లో క్రిస్టోఫర్‌ కొలంబస్‌ దక్షిణ అమెరికాకు వచ్చి వెళ్లిన తర్వాతే ఈ టమాటాలు యూరోపియన్లకు పరిచయం అయ్యి ఉంటాయని ఫుడ్‌ హిస్టారియన్లు అంటున్నారు. 1544లో ఆండ్రియా మట్టియోలి రాసిన హెర్బల్‌ గ్రంధంలో టమాటాల ప్రస్తావన ఉంటుంది. మొదట్లో యూరప్‌లో పండించే టమాటాలు పసుపు రంగులో ఉండేవట! అందుకే వాటిని ఎల్లో యాపిల్స్‌ అనేవారట! ఇప్పుడంటే లొట్టలేసుకుని తింటున్నారు కానీ ఒకప్పుడు బ్రిటన్‌లో వీటిని విషపూరిత పండ్లుగా భావించేవారు. అందుకు కారణం టమాటా మొక్కల ఆకులు సోలనేస్‌ జాతికి చెందిన డెడ్లీ నైట్‌షేడ్‌ మొక్కలను పోలి ఉండటమే! అందుకే వీటిని తినడానికి కాకుండా టేబుల్‌ను అందంగా డెకరేట్‌ చేసుకోవడానికి వాడేవారు.

వీటిని పాయిజన్‌ యాపిల్‌ అని బ్రిటన్‌ వాసులు పిల్చుకునేవారు. అప్పట్లో ధనవంతులు ఆత్మహత్య చేసుకోడానికి వీటిని తినేవారని ఆనాటి కథల్లో ఉంది. అవన్నీ తప్పుడు కథనాలన తర్వాత తేలిందనుకోండి.. ఇంత చెప్పిన తర్వాత టమాటాలు ఇండియాకు ఎలా వచ్చాయో చెప్పాలిగా! అసలు టమాటాలను మనకు పరిచయం చేసింది పోర్చుగీసువారు. ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్‌ హిస్టారియన్‌ కేటీ అచ్చయ్య తన ఇండియన్‌ ఫుడ్‌: ఏ హిస్టారిల్‌ కంపానియన్‌ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఒక్క టమాటాలే కాదు, మొక్కజొన్న, అవోకాడో, జీడిపప్పు, క్యాప్సికమ్‌, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ వంటి చాలా పంటలను పోర్చుగీసువారే భారత్‌కు తెచ్చారు అని కేటీ అచ్చయ్య వివరించారు.

మన దేశానికి టమాటాలు వచ్చి మహా అయితే రెండు వందల ఏళ్లు అయి ఉంటుందంతే! మొదట్లో టమాటాలో ఉసిరికాయంత సైజులో ఉండేవి. హైబ్రిడ్‌ టమాటా వచ్చిన తర్వాత పరిణామం పెరిగింది. ఆనాటి వంటల్లో టమాటా ప్లేస్‌లో చింతపండు ఉండేది. టమాట రేటు చింతపండు కంటే తక్కువ (ఇప్పుడు కాదు లేండి). పైగా టమాటాకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంది. అన్ని కూరగాయాలతోనూ ఇట్టే కలిసిపోతుంది. టమాటతో పప్పు చేసుకోవచ్చు. కూర చేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. ఇతర కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. అందుకే వీటి వినియోగం బాగా పెరిగింది. టమాటా లేకపోతే ముద్ద దిగదనేంత వరకు పరిస్థితి వచ్చింది. కిలో 150 రూపాయలైనా ఫర్వాలేదని కొనుక్కుంటున్నారు ప్రజలు.

Updated On 5 July 2023 7:16 AM GMT
Ehatv

Ehatv

Next Story