ఇది వికారాన్ని పుట్టించే వార్త.. జుగుప్స, అసహ్యం ఏకకాలంలో కలిగించే వార్త! ఐస్‌క్రీమ్(Ice Cream) అంటే చాలు డొక్కొనేటట్టుగా చేశాడా గలీజ్‌గాడు! వాడు ఏం చేశాడంటే ప్రజలకు అమ్మే ఐస్‌క్రీమ్‌లో తన వీర్యాన్ని(Sperms and urine), మూత్రాన్ని కలిపాడు.
ఇది వికారాన్ని పుట్టించే వార్త.. జుగుప్స, అసహ్యం ఏకకాలంలో కలిగించే వార్త! ఐస్‌క్రీమ్(Ice Cream) అంటే చాలు డొక్కొనేటట్టుగా చేశాడా గలీజ్‌గాడు! వాడు ఏం చేశాడంటే ప్రజలకు అమ్మే ఐస్‌క్రీమ్‌లో తన వీర్యాన్ని(Sperms and urine), మూత్రాన్ని కలిపాడు. అత్యంత అసహ్యాన్ని కలిగించే ఈ దారుణాన్ని చాటు నుంచి ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు కాబట్టి ఈ దుర్మార్గం బయటపడింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో(Social media) వైరల్ కావడంతో వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ సంఘటన వరంగల్(Warangal) జిల్లా నెక్కొండలో జరిగింది. రాజస్థాన్‌కు(Rajasthan) చెందిన కాలురాం పుర్బియా అనే వ్యక్తి అంబేద్కర్ చౌరస్తాలో ఐస్‌క్రీమ్ బండి పెట్టుకున్నాడు. బహిరంగంగానే తన వీర్యాన్ని, మూత్రాన్ని ఐస్‌క్రీమ్‌లో కలుపుతున్నప్పుడు ఓ వ్యక్తి దాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియాను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐస్‌క్రీమ్ బండికి సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు వరంగల్ జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ చేపూరి కృష్ణమూర్తి. పంచాయతీ కార్యదర్శి సదానందంతో కలిసి ఐస్‌క్రీమ్ బండిలోని ఐటమ్స్‌ను బయట పారబోయించారు. నెక్కొండలో ఐస్‌క్రీమ్‌లు అమ్మేవారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీచేశారు.