Food Tips : బియ్యం, పప్పుల్లో ఇవి ఉంచితే పురుగుపట్టవు..!
ఇంట్లో బియ్యం, పప్పులను నిల్వచేయడం సాధారణ విషయం కాదు. ఎక్కువ కాలం నిల్వ ఉండే వీటికి పురుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు, తేమ లేదా వాతావరణ మార్పుల కారణంగా నులిపురుగులు బియ్యం, పప్పుల్లో కనపడతాయి. పురుగును నివారించాలంటే కొన్ని ఈ చిట్కాలు పాటిస్తే సాధ్యమవుతుందని చెప్తున్నారు.
1. ఎండిన వేప ఆకులు(Neem leaves)
ఎండిన వేప ఆకుల బలమైన సువాసన కలిగి ఉండి నులిపురుగులను తరిమికొడుతుంది. బియ్యం లేదా పప్పులు నిల్వ ఉంచిన పాత్రల్లో ఎండిన వేప ఆకులు పెట్టాలి. ఆకులు పూర్తిగా పొడిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉంచాలి.
2. బే ఆకులు(Bay leaves)
మీ వంటగదిలో సాధారణంగా కనిపించే బే ఆకుల సువాసన కూడా పురుగుపట్టకుండా నివారిస్తుంది. బియ్యం, పప్పు పాత్రల్లో కొన్ని బే ఆకులను ఉంచాలని సూచిస్తున్నారు.
3. వెల్లుల్లి(Garlic)
అంతేకాకుండా వెల్లుల్లి కూడా పురుగుల నివారణకు సహాయపడుతుంది. బియ్యం, పప్పు పాత్రల్లో వెల్లుల్లి, కొన్ని లవంగాలను కలిపి ఉంచాలని సూచిస్తున్నారు. అయితే వెల్లుల్లి ఎండిపోయినప్పుడు తాజా వెల్లులిపాయలను ఉంచాలని చెప్తున్నారు.
4. బ్లాక్ పెప్పర్(Black peper)
నల్ల మిరియాలు కూడా నులిపురుగులను తరిమికొట్టడంలో సహాయపడతాయి. నల్ల మిరియాలను ఒక గుడ్డలో కట్టి బియ్యం , పప్పు పాత్రలలో ఉంచాలి.
5. అగ్గిపెట్టె(Match box)
అగ్గిపెట్టె దానిలో ఉన్న సల్ఫర్ కారణంగా పురుగులను నివారిస్తుంది. అగ్గిపెట్టెను బియ్యం , పప్పు పాత్రలలో ఉంచాలి.