ఎండల(summer) ప్రభావం పెరగడంతో చాలా మంది కరోనాతో సహా వైరల్‌ జ్వరాలతో(Viral fever) బాధపడుతున్నారు. వేసవిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే వ్యాధుల్లో మశూచి(chi) ఒకటి. ఇది 'వారిసెల్లా జోస్టర్' అనే వైరస్ వల్ల వస్తుంది. గర్భిణులు, నవజాత శిశువులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు ఈ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది.

ఎండల(summer) ప్రభావం పెరగడంతో చాలా మంది కరోనాతో సహా వైరల్‌ జ్వరాలతో(Viral fever) బాధపడుతున్నారు. వేసవిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే వ్యాధుల్లో మశూచి(chi) ఒకటి. ఇది 'వారిసెల్లా జోస్టర్' అనే వైరస్ వల్ల వస్తుంది. గర్భిణులు, నవజాత శిశువులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు ఈ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది.

రోగి యొక్క నోరు మరియు ముక్కు నుండి తడి కారడం.. ఈ వ్యాధి ప్రధాన లక్షణం. శరీరంలో బొబ్బలు కనిపిస్తాయి. అయితే ఇలా బొబ్బలు కనిపించడానికి ముందు చాలా చోట్ల దురద వస్తుంది. తరువాత బొబ్బలు వచ్చి.. అవి 6 నుంచి 10 రోజులు ఉంటాయి. సాధారణంగా వ్యాధిని ఒకసారి గుర్తించినట్లయితే అదిమళ్లీ వచ్చే అవకాశం లేదు అంటారు. కాని కొందరికి మళ్లీ వ్యాధి సోకిందని అధ్యయనాలు చెపుతున్నాయి.

మొదట ఒక చిన్న మొటిమతో ఈ వ్యాధి లక్షణం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అది ఒక రకమైన ద్రవంతో నిండిన పొక్కుగా మారుతుంది. చికెన్ ఫాక్స్ చాలా మందికి భిన్నంగా ఉంటుంది. వ్యాధిని తొలిదశలోనే గుర్తించలేకపోతే.. అది తీవ్రంగా మారుతుంది.

చికెన్ ఫాక్స్ ప్రధాన లక్షణాలు..

శరీరంపై బొబ్బలు(Blisters) కనిపించడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు శరీర నొప్పులు, తీవ్రమైన అలసట, జ్వరం మరియు సెంట్రల్ పెయిన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇన్ఫెక్షన్ యొక్క ప్రధాన లక్షణం చర్మంపై ఎరుపు లేదా గులాబీ బొబ్బలు. వ్యాధి ప్రారంభంలో.. బొబ్బలు ముఖం, ఛాతీపై కనిపిస్తాయి. అప్పటి నుంచి చిన్నగా శరీరం మొత్తం కనిపిస్తాయి.

జ్వరంతో పాటు వాంతులు, తలనొప్పి, కళ్లు తిరగడం, ఆకలి మందగించడం, శరీరంలో భరించలేని దురద వంటివి చికెన్ పాక్స్ యొక్క ఇతర లక్షణాలు.

చికెన్ ఫాక్స్ వస్తే ఇలా చేయడండి..

1. రోజూ గోరువెచ్చని నీటి స్నానం చేయండి.
2. శరీరంపై బొబ్బలను తాకవద్దు
3. అనారోగ్యం కలిగిన ఫస్ట్ డే నుంచి సరైన విశ్రాంతి అవసరం
4. వ్యాధి సులభంగా అంటుకునే అవకాశం ఉన్నందున పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులను కలవకుండా జాగ్రత్తగా ఉండండి.
5. కాటన్ దుస్తులు ధరించండి.
6. నూనె, మసాలా మరియు చింతపండు ఆహారాలకు దూరంగా ఉండండి.
7. దురద రాకుండా ఉండాలంటే వేప ఆకులను మంచంలో వేసుకుని పడుకోవాలి.

Updated On 5 May 2024 4:17 AM GMT
Ehatv

Ehatv

Next Story