మండే వేసవీ(Summer) కాలం వచ్చింది.. చెమటతో పాటు.. వడదెబ్బ.. డీహైడ్రేషన్ (Dehydration)లాంటి సమస్యలు కూడా తీసకువచ్చింది. మరి ఈ ఎండ వేడికి.. వడదెబ్బ తగలకుండా ఏం చేయాలి..? ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చూద్దాం..

మండే వేసవీ(Summer) కాలం వచ్చింది.. చెమటతో పాటు.. వడదెబ్బ.. డీహైడ్రేషన్ (Dehydration)లాంటి సమస్యలు కూడా తీసకువచ్చింది. మరి ఈ ఎండ వేడికి.. వడదెబ్బ తగలకుండా ఏం చేయాలి..? ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చూద్దాం..

నల్లని దుస్తులు వేసుకోకండి.. అవి వేసుకుని ఎండకు వెళ్తే..నలుపు ఎక్కువగా వేడిని గ్రహిస్తుంది వడదెబ్బ తగిలేలా చేస్తుంది. అందుకే బయటకు వెళ్తే.. అది కూడా ఎండకువెళ్తే.. తెల్లటి బట్టలు వేసకుని వెళ్ళండి చల్లగా ఉంటారు.

ఇక ఎండలో వెళ్ళేవారు తప్పకుండా క్యాప్ పెట్టుకోవడం మర్చిపోకండి.. లేకపోతే తలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి.. కళ్ళు తిరగడం.. డీహైడ్రేట్ అవ్వడం లాంటిది ఎక్కువగా జరుగుతుంది.

ఇక బయటకు వెళ్లేముందు కాని.. ఇంట్లో ఉన్నా కాని.. ఈ కాలంలో ఎక్కువుగా మజ్జిగ తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

మజ్జిగ మాత్రమే కాదు.. దాంట్లో నిమ్మరసం కలుపుకోండి.. అది డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అంతే కాదు. శరీరం లవణాలు కోల్పోకుండా నిమ్మరసం కాపాడుతుంది.

ఇక బయటకు వెళ్ళినప్పుడు కొబ్బరి బోండాలు కాని.. నిమ్మరసం కాని.. అవేవి లేకపోతు.. చేతిలో మంచి నీటి బాటిల్ అయినా తీసుకెళ్లండి.. బాగా నీరు తాగడం వల్ల.. శరీరం చల్లబడి.. ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది.

ఈ వేసవిలో కీరదోస ముక్కల్ని రెండుపూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను దరిచేరనీయవు. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది.

శరీరంలో నీటిశాతం తగ్గటం వల్ల వడదెబ్బ తగులుతుంది. దీనిని నివారించాలంటే నీటిశాతం ఎక్కువుగా ఉండే పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.

ఈ కాలంలో సలాడ్స్, తాజా కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందుకే సమ్మర్ లో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి. ఇలా రకరకాల మార్గాల్లో ఎండ వేడి నుంచి ఉపశమనం పొంది.. ఎండదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు.

Updated On 15 April 2023 1:41 AM GMT
Ehatv

Ehatv

Next Story