క్యాన్సర్(Cancer) ప్రపంచంలో ఇప్పుడు ఇదో పెనుభూతం. ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. చిన్నవయస్సు, యుక్త వయస్సు, మధ్య వయసు, వృద్ధులను.. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ప్రతీ లక్ష మందిలో ఏటా 100 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఓ నివేదిక(Report) ఈ విషయాన్ని బయటపెట్టింది.
క్యాన్సర్(Cancer) ప్రపంచంలో ఇప్పుడు ఇదో పెనుభూతం. ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. చిన్నవయస్సు, యుక్త వయస్సు, మధ్య వయసు, వృద్ధులను.. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ప్రతీ లక్ష మందిలో ఏటా 100 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఓ నివేదిక(Report) ఈ విషయాన్ని బయటపెట్టింది. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకొని ఆహారపు అలవాట్లు(Food Habits) మార్చుకుంటే ఈ మహమ్మారి నుంచి బయటపడే అవకాశముందని వైద్య నిపుణులు చెప్తున్నారు.ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదని, తమకు ఏమీ కాదని ఇంట్లోనే ఉంటే ఇది ముదిరి ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. డాక్టర్ల దగ్గరకు వెళ్తే ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటారని.. డబ్బులు బొక్క తప్ప ఏమీ ఉండదని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.
ముందుగానే వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ అయితే తగిన చికిత్సలు తీసుకోవాలని, దీంతో వ్యాధిని నివారించవచ్చని వైద్యనిపుణులు, క్యాన్సర్ బారి నుంచి కోలుకున్నవారు చెప్తున్నారు. క్యాన్సర్‌పై అవగాహన లేక ఎంతో మంది రోగులు(Patients) చివరి దశకు చేరుకొని ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. చాలామందికి తమకు క్యాన్సర్ సోకిందనే విషయం కూడా తెలియకుండా జీవిస్తున్నారు. చివరి రోజుల్లో క్యాన్సర్ ఉందని తెలిసినా, అప్పటికే అది శరీరంలో పాకిపోయి ఉండడంతో డాక్టర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. ఏటా లక్ష మందిలో 100 మందికిపైగా క్యాన్సర్ బారిన పడుతున్నారని డాక్టర్లే చెప్తున్నారు. అన్ని రకాల క్యాన్సర్‌కు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎటువంటి క్యాన్సర్‌నైనా ప్రారంభంలోనే గుర్తించి, సరైన సమయంలో చికిత్స అందిస్తే క్యాన్సర్‌ను నివారించడం పెద్ద విషయం కాదంటున్నారు వైద్యులు. ఓ ఏజ్ దాటాకనే ఈ క్యాన్సర్ వస్తుందనుకోవడం అపోహ మాత్రమేనని ఇప్పుడు అన్ని ఏజ్‌ల వారికీ క్యాన్సర్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. . ఏదైనా క్యాన్సర్ మహమ్మారి