ఇది చదివిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్(Fast Food) సెంటర్‌లో ఏదైనా తినేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అన్నీ సెంటర్లు ఇలాగే ఉన్నాయని కాదుకానీ చాలావాటిల్లో కల్తీ ఫుడ్‌నే జనాలకు అంటగడుతున్నారు. మనం తినే ఆహారం(Food) విషయంలోనైనా కాసింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు కానీ ప్రజలకే అంత సమయం ఉండటం లేదు. అల్లం వెల్లుల్లి(Zinger-Garlic) పేస్ట్‌ను కల్తీ చేస్తున్నారు. ఐస్ క్రీమ్‌లను(Ice-Cream) కల్తీ చేస్తున్నారు.
ఇది చదివిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్(Fast Food) సెంటర్‌లో ఏదైనా తినేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అన్నీ సెంటర్లు ఇలాగే ఉన్నాయని కాదుకానీ చాలావాటిల్లో కల్తీ ఫుడ్‌నే జనాలకు అంటగడుతున్నారు. మనం తినే ఆహారం(Food) విషయంలోనైనా కాసింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు కానీ ప్రజలకే అంత సమయం ఉండటం లేదు. అల్లం వెల్లుల్లి(Zinger-Garlic) పేస్ట్‌ను కల్తీ చేస్తున్నారు. ఐస్ క్రీమ్‌లను(Ice-Cream) కల్తీ చేస్తున్నారు. సాస్, చాకెట్లను కూడా వదలడం లేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా పంది కొవ్వుతో(Pig Fat) కల్తీ నూనెలు(Oils) తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి ముఠాను ఒకదాన్ని నేరెడ్‌మెట్(Neredmet) పోలీసులు పట్టుకున్నారు. నరగంలోని నేరెడ్‌మెంట్ పరిధిలోని ఆర్.కె.పురంలో(RK Puram) ఒక వ్యక్తి తాను ఉంటున్న ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. మొదట పంది మాంసం అమ్మేవారి దగ్గర నుంచి కొవ్వు తెచ్చుకుంటాడు. తర్వాత వాటిని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపి అచ్చంగా వంట నూనెలాగా కనిపించేట్టు ఆయిల్‌ను తయారు చేస్తున్నాడు. వీటిని రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ గలీజు దందాను గత కొలంగా నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. దాంతో కల్తీ గుట్టు రట్టయ్యింది. నిందితుడిని నేరెడ్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.