ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం కింద కొత్తగా చికెన్‌, సీజనల్‌ ఫ్రూట్స్‌ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది కానీ అధికారులు మరోలా అర్థం చేసుకున్నారు. చికెన్‌ ప్లేస్‌లో ఇంకేదైనా వండి వార్చవచ్చని ఫీలయ్యారు. బీర్భూమ్‌ జిల్లా మయూరేశ్వర్‌ బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చక్కగా పాముపిల్లను వేసి వడ్డించారు.. జనరల్‌గా ఫుడ్డులో బల్లో, ఎలుకో పడటం చూశాం కానీ పాము పిల్ల పడటం ఇప్పుడే వింటున్నాం. పాపం ఈ భోజనం చేసిన 30 […]

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం కింద కొత్తగా చికెన్‌, సీజనల్‌ ఫ్రూట్స్‌ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది కానీ అధికారులు మరోలా అర్థం చేసుకున్నారు. చికెన్‌ ప్లేస్‌లో ఇంకేదైనా వండి వార్చవచ్చని ఫీలయ్యారు.
బీర్భూమ్‌ జిల్లా మయూరేశ్వర్‌ బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చక్కగా పాముపిల్లను వేసి వడ్డించారు.. జనరల్‌గా ఫుడ్డులో బల్లో, ఎలుకో పడటం చూశాం కానీ పాము పిల్ల పడటం ఇప్పుడే వింటున్నాం. పాపం ఈ భోజనం చేసిన 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.. ఇదేదో తేడాగా ఉందని అనుకున్న పాఠశాల అధికారులు వారిని వెంటనే రామ్‌పూర్‌హట్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు కోపం తెప్పించింది. వారంతా వచ్చేసి పాఠశాలపై దాడికి దిగారు. ఓ టీచర్‌ వెహికిల్‌ను ధ్వంసం చేశారు.ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు విచారణకు ఆదేశించారు.

Updated On 7 Feb 2023 8:32 AM GMT
Ehatv

Ehatv

Next Story