ప్రస్తుతం ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నేటి ఆధునిక జీవనంలో మిగిలిపోయిన ఆహారాన్ని(Food), పండ్లను(Fruits) ఫ్రిజ్‌లో నిల్వ చేయడం అలవాటుగా మారింది. ముఖ్యంగా ఉద్యోగానికి వెళ్లేవారు మరుసటి రోజు వారికి సౌకర్యంగా ఉండేలా కాస్త ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకుంటారు. అందులోనూ మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది

ప్రస్తుతం ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నేటి ఆధునిక జీవనంలో మిగిలిపోయిన ఆహారాన్ని(Food), పండ్లను(Fruits) ఫ్రిజ్‌లో నిల్వ చేయడం అలవాటుగా మారింది. ముఖ్యంగా ఉద్యోగానికి వెళ్లేవారు మరుసటి రోజు వారికి సౌకర్యంగా ఉండేలా కాస్త ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకుంటారు. అందులోనూ మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఇప్పుడు అందరూ ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాలో(Plastic containers) నిల్వచేస్తుంటారు. వాటర్ దగ్గరి నుంచి.. పండ్లు, అన్నం, ఇలా అన్నింటిని ప్లాస్టిక్ పాత్రలలో పెట్టి ఫ్రీజ్ లో భద్రపరుస్తారు. అయితే ఈ ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని ఉంచడం సరైందేనా?.. చాలా మంది ఫ్రిజ్‌లో వంటగది పాత్రలను మాత్రమే ఉంచుతారు. అయితే కొంతమంది గాజు పాత్రలను ఉపయోగిస్తారు. కానీ ఎక్కువ మంది మాత్రం ప్లాస్టిక్ పాత్రలలో మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేస్తారు. కానీ ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని నిల్వచేయడం మంచిదేనా అనేది తెలుసుకుందాం.

ప్లాస్టిక్ కంటైనర్లు ఫ్రిజ్‌లో ఉంచడం సురక్షితమేనా?

ఫ్రిజ్‌లో(Fridge) ఉంచడానికి మనం సురక్షితంగా ఉండే పాత్రలను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆహారం పాడవకుండా ఉండాలని కోరుకుంటాం. ప్లాస్టిక్ వస్తువులలో ఆహారాన్ని ఉడికించడం, వేడి చేయడం, ఫ్రిజ్‌లో ఉంచడం లేదా నిల్వ చేయడం మంచిది కాదు. నేటి కాలంలో మైక్రోవేవ్, ఓవెన్(Oven) వంటి మాదిరిగానే ప్లాస్టిక్ కూడా ఎక్కువగా ఉపయోగించే వస్తువు. కానీ అది ఆరోగ్యానికి సురక్షితం కాదు. ప్లాస్టిక్ పాత్రలో ఆహారాన్ని ప్యాక్ చేయడానికి బదులుగా మీరు అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించవచ్చు.

పాలిథిలిన్ టెరాఫ్తలెట్

మార్కెట్‌లో లభించే పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ ప్లాస్టిక్ కంటైనర్‌లు బెస్ట్ అంటారు. ఈ ప్లాస్టిక్ పాత్రను నీటితో శుభ్రం చేసిన తర్వాత రెండుసార్లు ఉపయోగించవచ్చు. కానీ పదే పదే కడగడం వల్ల అందులో ఉండే రసాయనాలు ఆహారంలో లేదా నీళ్లలో కలిసిపోతాయి. అటువంటి పరిస్థితిలో పాత్రలను ఎక్కువసార్లు ఉపయోగించినట్లైతే వెంటనే వాటిని పక్కన పెట్టేయండి.

బయో ప్లాస్టిక్(Bio Plastic) ఉపయోగించండి

మీరు మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేయడానికి బయో ప్లాస్టిక్ ఉపయోగించండి. బయో ప్లాస్టిక్ ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీని తయారీకి మొక్కజొన్న, బంగాళదుంపలు, చెరకు ఉపయోగిస్తారు. ఆహారాన్ని నిల్వచేయడానికి ఇది ఉత్తమం.

Updated On 8 Jun 2023 10:52 PM GMT
Ehatv

Ehatv

Next Story