చాలా మంది.. జీడిపప్పు(Cashew Nuts).. బాదాం పప్పు(Almond) అంటారు కాని.. పిస్తా(Pista) పప్పు వాడేవారు చాలా తక్కువ. అంతే కాదు.. చాలా మందికి దాని గురించి తెలియదు కూడా.. కాని దాని రుచి, ఉపయోగాలు తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు.
చాలా మంది.. జీడిపప్పు(Cashew Nuts).. బాదాం పప్పు(Almond) అంటారు కాని.. పిస్తా(Pista) పప్పు వాడేవారు చాలా తక్కువ. అంతే కాదు.. చాలా మందికి దాని గురించి తెలియదు కూడా.. కాని దాని రుచి, ఉపయోగాలు తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. నువ్వేమన్నా పిస్తావా అంటూ సామెత చెపుతుంటారు కదా.. అది ఒక్కటి చాలు పిస్తా పప్పు గురించి తెలుసుకోవడానికి.
అనేక శతాబ్దాల క్రితం నుండి పిస్తాపప్పు ప్రజలు తినేందుకు ఇష్టపడుతున్నారు. వీటిలో అనేక ఔషధ ప్రయోజనాలు ఉండటం వల్ల మన పూర్వికులు సైతం ఉపయోగించారు. మలబద్ధకం(Constipation) జీర్ణ సమస్యల(Digestion Problems) చికిత్సకు అనేక దేశాలలో వేల సంవత్సరాల క్రితం నుండి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో, పిస్తాపప్పులు శరీరం, మనస్సుకు ,మెదడు పనితీరును మెరుగుపరచడానికి ,మొత్తం శరీర శక్తికి సహాయపడతాయి.
పిస్తాపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ B6 మరియు థయామిన్‌తో సహా వివిధ పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. అవి బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. గట్, కంటి , రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పిస్తా గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్లు కలిగి ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవాలనుకునే వారు ఈ ఆరోగ్యకరమైన గింజలను ఆహారంలో చేర్చుకోవచ్చు. పిస్తాపప్పును వంటకాలలో రుచి కోసం ఉపయోగించవచ్చు.
డయాబెటిస్‌తో బాధపడుతున్న చాలా మంది ఆరోగ్యకరమైన అల్పాహారాలను తీసుకోవటానికి ఇష్టపడతారు. ఇవి కడుపును నిండుగా ఉంచటంతోపాటు, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. టీ తీసుకునే సమయంలో రుచికరమైన ,పోషక విలువలు కలిగిన పిస్తాపప్పులను తీసుకోవచ్చు. పిస్తాపప్పులు కరకరలాడుతూ, వగరుగా , కొద్దిగా తీపిగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి సరైన చిరుతిండిగా నిపుణులు సూచిస్తున్నారు.