వేసవిలో అజీర్తి సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యం ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.. ఆకలిగా ఉండకపోవడం జరుగుతుంది. వేసవిలో కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ఎండాకాలంలో డయేరియా, అజీర్తి, గ్యాస్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
వేసవిలో(summer) అజీర్తి సమస్య(indigestion Problems) ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యం ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.. ఆకలిగా ఉండకపోవడం జరుగుతుంది. వేసవిలో కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ఎండాకాలంలో డయేరియా, అజీర్తి, గ్యాస్(gastric Problems) సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో మిగిలిన ఆహారం తినడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. స్పైసీ ఫుడ్ ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే పైనాపిల్ జ్యూస్ మీ రోజూవారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోండి. అది జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడటమే కాకుండా, ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. అవెంటో తెలుసుకుందామా.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో పైనాపిల్ సహాయపడుతుంది
వేసవిలో జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే పైనాపిల్ జ్యూస్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పొత్తికడుపు నొప్పి, మలబద్ధకం, ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పైనాపిల్‌లో విటమిన్ సి, బ్రోమెలైన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణ సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది. బౌల్ మూమెంట్ రెగ్యులర్ గా, స్మూత్ గా మారుతుంది. ఉదయం పూట పైనాపిల్ జ్యూస్ తాగడం మంచిది..
పైనాపిల్ జ్యూస్(pine apple Benefits) ప్రయోజనాలు..
1. పైనాపిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. దీనిలో ఉండే పొటాషియం బీపీ రోగులకు కూడా మేలు చేస్తుంది.
2. పైనాపిల్ జ్యూస్ (Pine apple juice)tఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే మాంగనీస్ వంటి మినరల్స్ ఎముకల బలం చేకురుస్తాయి. చిగుళ్లు, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో పైనాపిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
3. పైనాపిల్ జ్యూస్ కంటి చూపును మెరుగుపరచడంలో(eye sight) కూడా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ లభిస్తుంది. రోజూ ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ తాగితే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. మాక్యులార్ డీజెనరేషన్‌ను నివారించే శక్తి దీనికి ఉంది.
4. పైనాపిల్‌లో విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనిని రోజూ తీసుకోడం వలన అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.