పెరుగులో ఎన్నో ఔషద గుణాలుఉన్నాయి. అది తినడం వల్ల ఎంతో ఆరోగ్యం.. కాని పెరుగుఅందరూ తినకూడదు.. కొన్నిఆరోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగు తినకూడదు అంటున్నారు నిపుణులు. ఇంతకీ పెరుగు ఎవరు తినకూడదు. ఎందుకు తినకూడదు.. తింటే ఏమౌతుంది చూద్దాం. ఎవరు పెరుగును తినొచ్చు.. ఎవరు పెరుగును తినకూడదు అనేది చూసుకుంటే.. ఎక్కువగా జీర్ణ సమస్యలు(Digestive Problems) ఉన్నవారు ప్రతిరోజు పెరుగును తీసుకోవడం వల్ల వారికి కడుపు నొప్పి రావడమే కాకుండా మలబద్ధకం(constipation) సమస్య కూడా ఏర్పడుతుంది.
చాలా మందికి బోజనంలో చివరిగా పెరుగుతినే(Perugu) అలవాటు ఉంటుంది. అది మంచిదే.. కాని కొన్ని కొన్ని సందర్భాల్లోనే కొన్ని సమస్యలు ఉన్నవారు పెరుగుకిదూరంగా ఉండాలి. లేకుంటే అనారోగ్యం మీ వెంటే ఉంటుంది మరి. ఇక ఎవరు పెరుగుతినకూడదంటే..?
పెరుగులో ఎన్నో ఔషద గుణాలుఉన్నాయి. అది తినడం వల్ల ఎంతో ఆరోగ్యం.. కాని పెరుగుఅందరూ తినకూడదు.. కొన్నిఆరోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగు తినకూడదు అంటున్నారు నిపుణులు. ఇంతకీ పెరుగు ఎవరు తినకూడదు. ఎందుకు తినకూడదు.. తింటే ఏమౌతుంది చూద్దాం. ఎవరు పెరుగును తినొచ్చు.. ఎవరు పెరుగును తినకూడదు అనేది చూసుకుంటే.. ఎక్కువగా జీర్ణ సమస్యలు(Digestive Problems) ఉన్నవారు ప్రతిరోజు పెరుగును తీసుకోవడం వల్ల వారికి కడుపు నొప్పి రావడమే కాకుండా మలబద్ధకం(constipation) సమస్య కూడా ఏర్పడుతుంది.
అంతే కాదు పైత్యం వల్ల కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగును తింటే నొప్పులు మరింత పెరుగుతాయి. పెరుగు వాతాన్ని, పైత్యాన్ని మరింతగా పెంచుతుంది. అంతే కాదు ఆయాసం, ఆస్తమా ఉన్న వారు కూడా పెరుగును తింటే ఉబ్బసం మరింత పెరుగుతుంది.ఎసిడిటీ, గ్యాస్ సమస్య ఉన్నవారు పెరుగు తింటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఎగ్జిమా, దురద, ఇన్ఫెక్షన్ మరియు మొటిమల వంటి సమస్యలు ఉన్నవారు, ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతున్న వారు పెరుగును తినకుండా ఉండటమే మంచిది.
వారు ఒకవేళ పెరుగు తింటే ఆ సమస్య మరింత పెరుగుతుంది. మహిళల్లో వైట్ డిస్చార్జ్ సమస్య ఉన్నవారు పెరుగు తినకుండా ఉండాలి. అలాంటివారు ఎక్కువగా పెరుగును తినడం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగును తినకుండా ఉండటమే మంచిదని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా పెరుగును తినాలి అంటే అలాంటి వారు పెరుగును మజ్జిగ రూపంలో చేసుకుని తాగితే మంచిది.