ప్రస్తుతం వేసవి కాలం(Summer season) నడుస్తోంది. వేసవి కాలం వచ్చిందంటే దుకాణాల్లో రకరకాల జ్యూస్‌లు(Juices), శీతల పానీయాలు(Cooldrinks) జోరుగా విక్రయిస్తున్నారు. ఇందులో నిమ్మరసం(Lemon juice), మజ్జిగ(Lassi), పుదీనా రసం, చెరుకు రసం మొదలైనవి ఎక్కువ.
ముఖ్యంగా చెరుకు రసం(Sugarcane Juice) అంటే ఇష్టపడనివారు ఉండరు.. అది అందరికి తెలిసిందే.. తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ప్రస్తుతం వేసవి కాలం(Summer season) నడుస్తోంది. వేసవి కాలం వచ్చిందంటే దుకాణాల్లో రకరకాల జ్యూస్‌లు(Juices), శీతల పానీయాలు(Cooldrinks) జోరుగా విక్రయిస్తున్నారు. ఇందులో నిమ్మరసం(Lemon juice), మజ్జిగ(Lassi), పుదీనా రసం, చెరుకు రసం మొదలైనవి ఎక్కువ.
ముఖ్యంగా చెరుకు రసం(Sugarcane Juice) అంటే ఇష్టపడనివారు ఉండరు.. అది అందరికి తెలిసిందే.. తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
చెరకు రసం శరీరాన్ని చల్లబరచడమే కాకుండా అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఇది జీర్ణక్రియకు, ఎముకల ఆరోగ్యానికి మరియు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరూ దీనిని తాగకూడదు ఎందుకంటే ..?

చెరుకు రసం కొంతమందికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. చెరుకు రసం ఎవరు తాగకూడదో ఇప్పుడు చూద్దాం. మధుమేహ వ్యాధిగ్రస్తులు(Diabetics) చెరుకు రసం తాగకూడదు. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచిక, అధిక గ్లైసెమిక్ లోడ్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుంది. ఇంకా ఇందులో చాలా షుగర్ ఉన్నందున, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తాగితే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు. ఇందులో ఉండే పాలీకోసనాల్ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి అనేక సమస్యలు వస్తాయి.
స్థూలకాయులు చెరుకు రసం తాగకూడదు. ఇది అధిక కేలరీల కంటెంట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని తాగడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. అలాగే ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు చెరుకు రసం తాగకూడదు.

మీకు జలుబు(Cold) లేదా దగ్గు(Cough) ఉంటే చెరుకు రసం తాగవద్దు. అతిగా తాగితే అవి పెరగడమే కాకుండా గొంతునొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
మీరు నిద్రలేమితో బాధపడుతుంటే చెరుకు రసం తాగకూడదు. ఇందులోని పాలీకోసనాల్ నిద్రపై చెడు ప్రభావం చూపుతుంది. దీని కారణంగా మీరు నిద్రలేమి మరియు ఒత్తిడి సమస్యలను ఎదుర్కోవచ్చు.

Updated On 8 April 2024 5:43 AM GMT
Ehatv

Ehatv

Next Story