పుట్టగొడుగులలో చాలా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఇది చాలా ఖరీదైన ఆహారం. అయినా ఇందులో శరీరానికి అవసరమయ్యే B, D విటమిన్లు(Vitamins), పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం సమృద్ధిగా ఉంటాయి. అయితే పుట్టగొడుగులలో రకరకాలుగా ఉంటాయి. ఇందులో కొన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తే.. కొన్ని మాత్రం కొంత మంది తినకూడదు...

పుట్టగొడుగులు(Mushrooms) రెస్టారెంట్లు.. లేదా బాగా డబ్బున్న వారింటివంటకం అని అనుకుంటారు అంతా. కాని దానిలోని పోషకాల గురించి తెలిస్తే.. ఎంత ఖర్చు పెట్టి అయినా కొని తినేస్తారు. వాటిలో ఎన్ని ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయో తెలుసా...?

పుట్టగొడుగులలో చాలా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఇది చాలా ఖరీదైన ఆహారం. అయినా ఇందులో శరీరానికి అవసరమయ్యే B, D విటమిన్లు(Vitamins), పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం సమృద్ధిగా ఉంటాయి. అయితే పుట్టగొడుగులలో రకరకాలుగా ఉంటాయి. ఇందులో కొన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తే.. కొన్ని మాత్రం కొంత మంది తినకూడదు... ఎందుకంటే.. వీటివల్ల వారికి చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌(Side effects) ఉంటాయి. రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు.

ఎప్పుడూ అలసటకు గురయ్యేవారు.. పుట్టగొడుగులను తినడం మంచిది కాదు. శరీరంలో శక్తిలేకపోవడం వల్ల కొంతమంది ఊరికే అలసిపోతుంటారు. అయితే పుట్టగొడుగులను తిన్న తర్వాత వారు బాగా అలసటకు గురవుతారు. అందుకే ఒంట్లో శక్తి తక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులను తినకూడదు.

అందుకే మంచి పుట్టగొడుగులు, చెడు పుట్టగొడుగుల మధ్య తేడాను గుర్తించాలి. అయితే ఎవరు వీటికి దూరంగా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం. పుట్టగొడుగులను తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే చర్మ సమస్యలు ఉన్నవారు ఈ సూపర్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. చర్మంపై దద్దుర్లు, చికాకు, అలెర్జీలు ఉంటే పుట్టుగొడుగులు తినవద్దు.

కడుపులో తరచుగా నొప్పితో బాధపడేవారు పుట్టగొడుగులను తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది కడుపులో మరింత అసౌకర్యాన్ని పెంచుతుంది. కడుపు నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది.

గర్భిణులు కూడా పుట్టగొడుగులను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే తల్లుల్లు, గర్భిణులు ఈ సూపర్ ఫుడ్ కూడా దూరంగా ఉండాలి. ఇవి వీరిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని చెబుతున్నారు.

Updated On 17 Aug 2023 7:18 AM GMT
Ehatv

Ehatv

Next Story