ఎవరేమనుకున్నా మనకు జిహ్వా చాపల్యం కూసింత ఎక్కువేనండి! అచ్చ తెలుగులో చెప్పాలంటే తిండి యావ అన్న మాట! రోడ్డు మీద కనిపించిన ఫుడ్డునంతా ఇష్టంగా లాగించేస్తుంటాం! ఎలా వండారు? ఏ రకంగా వండారు? అన్న విషయాలను పెద్దగా పట్టించుకోము. ఇప్పుడేమో జంక్‌ఫుడ్‌కు అలవాటపడ్డాం. చైనావాడు మనకు అంటకట్టిన నూడిల్స్‌ను అలవాటు లేకపోయినా తినేస్తున్నాం. సాయంత్రం న్యూడిల్స్‌ స్టాల్స్‌ ముందు కనిపించే సందడిని చూస్తే చాలు. ఆ విషయం అర్థమవుతుంది. ఇంతగా ముచ్చటపడి తింటున్న ఆ నూడుల్స్‌ను ఎలా […]

ఎవరేమనుకున్నా మనకు జిహ్వా చాపల్యం కూసింత ఎక్కువేనండి! అచ్చ తెలుగులో చెప్పాలంటే తిండి యావ అన్న మాట! రోడ్డు మీద కనిపించిన ఫుడ్డునంతా ఇష్టంగా లాగించేస్తుంటాం! ఎలా వండారు? ఏ రకంగా వండారు? అన్న విషయాలను పెద్దగా పట్టించుకోము. ఇప్పుడేమో జంక్‌ఫుడ్‌కు అలవాటపడ్డాం. చైనావాడు మనకు అంటకట్టిన నూడిల్స్‌ను అలవాటు లేకపోయినా తినేస్తున్నాం. సాయంత్రం న్యూడిల్స్‌ స్టాల్స్‌ ముందు కనిపించే సందడిని చూస్తే చాలు. ఆ విషయం అర్థమవుతుంది. ఇంతగా ముచ్చటపడి తింటున్న ఆ నూడుల్స్‌ను ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం ఇక ఛస్తే వాటి జోలికి పోరు. నూడుల్స్‌ తయారీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

నూడుల్స్‌ను తయారు చేసే ఓ బేకరీలో ఆ వీడియో తీశారు. ఆ బేకరీ పరిసరాలు, తయారీకి వారు ఉపయోగిస్తున్న యంత్రాలు, పాత్రలు చాలా గలీజుగా ఉన్నాయి. తయారీ సమయంలో కార్మికులెవరూ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు . ఒక్కరికి కూడా చేతులకు గ్లౌజులు లేవు. ఇక పరిశుభ్రత అంటారా? దాని గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. నూడుల్స్‌ని ఇష్టానికి నేలపై విసిరేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Updated On 7 Feb 2023 8:30 AM GMT
Ehatv

Ehatv

Next Story