తేనె.. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని వైద్యులు చెబుతుంటారు. పాలు, కాఫీ, టీల్లో తేనె వేసుకుని తీసుకుంటారు. తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అలాగే బరువు తగ్గించడంలో తేనె ఎక్కువగా ఉపయోగపడుతుందని భావిస్తారు. వేడి నీటిలో అలాగే గ్రీన్ టీలో తేనెను కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో తేనె వాడకం అధికం. తేనెలో యాంటి సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి.

తేనె.. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని వైద్యులు చెబుతుంటారు. పాలు, కాఫీ, టీల్లో తేనె వేసుకుని తీసుకుంటారు. తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అలాగే బరువు తగ్గించడంలో తేనె ఎక్కువగా ఉపయోగపడుతుందని భావిస్తారు. వేడి నీటిలో అలాగే గ్రీన్ టీలో తేనెను కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో తేనె వాడకం అధికం. తేనెలో యాంటి సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ బయోటిక్, విటమిన్ బీ6 కూడా ఎక్కువగానే ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా చక్కటి నిద్రపోవడానికి సహయపడుతుంది. అయితే ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందించే ఈ తేనెతోపాటు కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్యులు. ఇంతకీ తేనెతో కలిపి ఏఏ పదార్థాలను తీసుకోవద్దు అనేది ఇప్పుడు తెలుసుకుందామా.

వేడి నీరు, పాలు..
తేనెను ఎప్పుడూ కూడా వెచ్చని పదార్థాలతో తీసుకోవద్దు. ఎందుకంటే తేనె సహజంగానే వేడిగా ఉంటుంది. వేడి వస్తువులతో కలిపి తీసుకోవడం వలన శరీరానికి హాని కలుగుతుంది. కొందరు వేడి నీటిలో, వేడి పాలలో తేనె కలుపుకుని తాగుతుంటారు. ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

మాంసం, చేపలు..
మాంసాహారంతో తేనెను కలిపి ఎప్పుడూ తీసుకోవద్దు. అలాగే చేపలతో కూడా కలిపి ఎప్పుడూ తీసుకోవద్దు. వీటిని తిన్న గంట ముందు అలాగే గంట తర్వాత వరకు తీసుకోవద్దు. వీటిని కలిపి తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తుంటాయి.

నెయ్యితో కలిపి..
నెయ్యితో కలిపి తేనెను ఎప్పుడూ తీసుకోవద్దు. ఎందుకంటే నెయ్యి, తేనెలోని పోషకాలు ఒకదానికొకటి క్రాస్ చేస్తాయి. ఈ రెండింటిని కలిపి తినడం వలన కడుపు నొప్పి, తలనొప్పి వస్తుంది.

చక్కరతో..
తేనెలో పంచదార కలిపితే ఆ మిశ్రమాన్ని విషమనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బదిపెడతాయి. కనీసం ఒక గంట ముందు, ఆ తర్వాత మాత్రమే తేనె తీసుకోవాలి..

Updated On 14 Jun 2023 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story