ప్రస్తుతం కాలంలో ఆరోగ్యవంతులను చూడటం అరుదు అయిపోయింది. రకరకాల రుగ్మతలతో మనుషులు ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్ టైమ్ లో .. మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. శరీరంలోని వ్యర్థాలు మూత్రం(Urine) ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కాని అక్కడ సమస్య రావడంతో.. శరీరానికి ఇబ్బంది తప్పడంలేదు.

మూత్రం నిలిచిపోయి.. మూత్రం సరిగ్గా శరీరం నుండి బయటకు రాకపోతే, అది అనేక సమస్యలను కలిగిస్తుంది. అంతే కాదు కిడ్నీలో రాళ్ళు(Kidney stones) ఉండటంతో.. మూత్రంలో చీము చేరడం లాంటివి కూడా చూస్తుంటాం.. మితిమీరిన మసాలా ఆహారం, చాలా తక్కువ నీరు త్రాగడం, డ్రై ఫుడ్, ఆల్కహాల్ అలవాటు, మూత్రాన్ని అడ్డుకోవడం మరియు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి.
కిడ్నీలో రాళ్లను బయటకు తీయడానికి మందులు మరియు వైద్య పద్ధతులు ఉన్నప్పటికీ, మనం తినే ఆహారం ద్వారా కూడా మూత్రపిండాల్లో రాళ్లను బయటకు తీయవచ్చు. అందులో ముఖ్యమైనది అరటి కాండం(Banana stem). ఇది కిడ్నీలో రాళ్లను బయటకు పంపే శక్తి కలిగి ఉంటుంది.
ఆహారంలో అరటి కాండం తరచుగా తీసుకోవడం వల్ల ప్రారంభ దశలో ఉన్న రాళ్లను చాలా సులభంగా కరిగించవచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వారానికి మూడుసార్లు అరటిపండును ఆహారంలో చేర్చుకోవాలి.అధిక ఫైబర్ ఆహారం వల్ల అధిక శరీర బరువు, మధుమేహం(diabetes) మరియు హైపర్లిపిడెమియాతో(hyperlipidemia) బాధపడుతున్న వారికి అరటి కాండం ఒక అద్భుతమైన నివారణ. ఇది రక్తాన్ని శుద్ధి చేసే స్వభావం కలిగి ఉంటుంది.
అంతే కాదు అరటి కాండం.. అరటిపండు రెండింటిలో కడుపులోని అల్సర్లను నయం చేసే శక్తి ఉంది. బరువు తగ్గాలని డైట్‌లో ఉన్నవారు అరటిపండును ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి